న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ నాయకుల్లో విజేతలెవరో తేలేందుకు మరో నాలుగు రోజుల(మే 16వరకు) గడువుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వారందరిలో కొంత మంది మాత్రమే విజయం సాధించే అవకాశం ఉంటుంది. గెలిచిన వారి సంబరాలకు అవధులుండవు. కానీ చాలామంది అభ్యర్థులు ఇప్పటికే తాము గెలిచిపోయినట్లు సంబరపడిపోతున్నారు.
ఎన్నికల తర్వాత సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న ప్రగాఢమైన నమ్మకంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డుల వైపు పరుగులు తీయడంతో ఈ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు భారీగా పెట్టుబడులు పెట్టిన పలు బ్లూచిప్ కంపెనీల షేర్ల ధరలు అనూహ్యంగా పెరిగిపోవడమే దీనికి కారణం. ఇలా సంపన్నులైన అభ్యర్థులు పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ పవర్, టిసిఎస్‌లాంటి బ్లూచిప్ సంస్థలున్నాయి. బారామతి సిట్టింగ్ ఎంపి సుప్రియా సూలేకు దాదాపు 80 కంపెనీల్లో రూ. 5.6 కోట్లకు పైగా విలువైన వాటాలున్నాయి.
ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ కుమార్తె, బారామతి సిట్టింగ్ ఎంపి సుప్రియా సూలేకు దాదాపు 80కి పైగా కంపెనీల్లో రూ. 5.6 కోట్లకు పైగా విలువైన వాటాలున్నాయి. యునైటెడ్ బ్రూవరీస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, కోల్ ఇండియా, బ్రిటానియా, డిఎల్‌ఎఫ్, హిందుస్థాన్ యూనీలీవర్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, రాన్‌బాక్సీలాంటి కంపెనీలు వీటిలో ఉన్నాయి. ముంబై నార్త్ సెంట్రల్ బిజెపి అభ్యర్థి పూనమ్ మహాజన్ భర్త విజేంద్రకు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండియా బుల్స్ పవర్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, టిసిఎస్, రిలయన్స్ పవర్, ఐడియా సెల్యులార్ తదితర కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు. పూనమ్ ఎక్కువగా అన్‌లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టింది.

సినీ నటుడు, అహ్మదాబాద్ తూర్పు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పరేష్ రావల్‌కు లిస్టెడ్ కంపెనీల్లో రూ. 1.37 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. ఆయన వద్ద రూ. 45 లక్షల విలువైన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు, రూ. 20 లక్షల విలువైన టాటా స్టీల్ షేర్లే కాకుండా టిసిఎస్‌లో కొద్దిపాటి వాటా కూడా ఉంది. రావల్ భార్య స్వరూప్‌కు సైతం రూ. 43 లక్షల షేర్లు ఉన్నాయి. కాంగ్రెస్ యూత్ బ్రిగేడ్‌లో ఒకరైన మిలింద్ దేవర భార్య పూనమ్‌కు దిశ్‌మన్ ఫార్మా, ముక్తా ఆర్ట్స్, ఎన్‌ఐఐటి, ఓబెరాయ్ రియల్టీ,యాడ్‌లాబ్ ఫిలిమ్స్‌లాంటి తొమ్మిది లిస్టెడ్ కంపెనీల్లో వాటాలున్నాయి.
కాగా, ముంబై నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న గురుదాస్ కామత్, బిజెపి అభ్యర్థి కిరిట్ సోమయ్య, ఎంఎన్‌ఎస్ అభ్యర్థి, సినీ నిర్మాత మహేశ్ మంజ్రేకర్‌లాంటి వారు కూడా స్టాక్‌మార్కెట్లలో లిస్టింగ్ అయిన పలు కంపెనీలకు చెందిన వాటాలు కలిగి ఉన్నారు. బెంగళూరు సెంట్రల్‌నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఇన్ఫోసిస్ మాజీ బోర్డు సభ్యుడు వి బాలకృష్ణన్‌కున్న మొత్తం రూ. 190 కోట్ల ఆస్తుల్లో రూ. 103 కోట్లు ఇన్ఫోసిస్‌లో ఆయనకున్న వాటాలే. మరో రూ. 5.26 కోట్ల విలువైన ఇన్ఫోసిస్ లిమిటెడ్‌కు చెందిన అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్‌లు కూడా ఆయన వద్ద ఉన్నాయి.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, దక్షిణ బెంగళూరు కాంగ్రెస్ అభ్యర్థి నందన్ నీలేకని, ఆయన భార్య రోహిణి నీలేకనికి ఉన్న రూ. 7,700 కోట్ల ఆస్తుల్లో దాదాపు 80 శాతం ఇన్ఫోసిస్ షేర్లద్వారా లభించిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, రూ. 3,500 కోట్ల విలువైన అమరరాజా బ్యాటరీస్ ఎండి గల్లా జయదేవ్ ఆ కంపెనీ ప్రమోటర్లలో ఒకరు. ఆయనకు కంపెనీలో రూ. 1.26 కోట్ల విలువైన వాటాలతో పాటు ఆంధ్రాబ్యాంక్, ఎల్‌కెపి ఫైనాన్స్, పద్మాలయా టెలీ ఫిలిమ్స్‌లాంటి మరికొన్ని కంపెనీల్లో సైతం వాటాలున్నాయి.
మూడు నెలల్లో భారీ వృద్ధి
గత మూడు నెలల్లో ఆర్ఐఎల్ (22 శాతం), ఎం అండ్ ఎం (23 శాతం), ఎన్ఐఐటి (28 శాతం), సిఇఎస్‌సి (14 శాతం) మేర పెరిగాయి. ఆర్‌పిజి లైఫ్‌సైన్సెస్ 50 శాతానికి పైగా పెరిగింది. ఇండియాబుల్స్ పవర్, ఎడెల్‌విజ్, రిలయన్స్ పవర్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, జిఎంఆర్ ఇన్‌ఫ్రా షేర్లు 10 శాతం నుంచి 30 శాతం వరకు వృద్ధి సాధించాయి.
More From GoodReturns

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

TCS Q4 FY26 Results: టీసీఎస్ క్యూ4 ఎఫ్వై26 ఫలితాలు ఇవిగో.. భారీగా పెరిగిన లాభాలు..డివిడెండ్ ఎంతంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications