న్యూయార్క్/న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్‌లో నమోదైన ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన పబ్లిక్ కంపెనీల్లో భారత కంపెనీలు సత్తా చాటుకుంటున్నాయి. 2,000 కంపెనీలతో ఫోర్బ్స్ విడుదల చేసిన వార్షిక జాబితాలో 54 భారత కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఈ కంపెనీల్లో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ రాబడి, లాభాలు, ఆస్తులు, మార్కెట్ విలువ ఆధారంగా కంపెనీల జాబితాను రూపొందించారు.
2,000 కంపెనీల్లో తొలి మూడు స్థానాలను చైనా పబ్లిక్ కంపెనీలే సొంతం చేసుకోవడం విశేషం. టాప్ 10 కంపెనీల్లో ఐదు కంపెనీలు చైనావే ఉన్నాయి. మొత్తం కంపెనీల్లో 564 పబ్లిక్ కంపెనీలు యుఎస్‌కు చెందినవే కావడం గమనార్హం. యుఎస్ తర్వాత 225 కంపెనీలతో జపాన్ ద్వితీయ స్థానంలో ఉంది. ఫోర్బ్స్ జాబితాలో చైనీస్ బ్యాంక్ ఐసిబిసి వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంకు, మూడో స్థానంలో అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా ఉన్నాయి.
ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 62 దేశాల కంపెనీలు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మొత్తం 2,000 కంపెనీల రాబడి 38 లక్షల కోట్ల డాలర్లుండగా.. లాభం 3 లక్షల కోట్ల డాలర్లు, ఆస్తుల విలువ 161 కోట్ల డాలర్లు, మార్కెట్ విలువ 44 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. నిరుడితో పోల్చితే కంపెనీల మార్కెట్ విలువ 13 శాతానికి పైగా పెరిగింది. ఈ కంపెనీలన్నీ ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తున్నాయని ఫోర్బ్స్ వెల్లడించింది.

ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 135వ స్థానంలో నిలిచింది. 2014 మే వరకు ఈ కంపెనీ మార్కెట్ విలువ 5,090 కోట్ల డాలర్లుగా ఉంది. ఆర్ఐఎల్ తర్వాత వరుసగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (155వ స్థానం - 2,360 కోట్ల డాలర్లు), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (176వ ), ఐసిఐసిఐ బ్యాంకు (304), టాటా మోటార్స్ (332), ఇండియన్ ఆయిల్ (416), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు (422), కోల్ ఇండియా (428), లార్సన్ అండ్ టూబ్రో (500), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (543), భారతీ ఎయిర్‌టెల్ (625), యాక్సిస్ బ్యాంక్ (630), ఇన్ఫోసిస్ (727)తోపాటు తదితర 54 కంపెనీలున్నాయి.
‘రూపే' కార్డును జాతికి అంకితం చేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశీయంగా వీసా, మాస్టర్ కార్డులతో పోల్చితే సరిసమాన సేవలు అందించే రూపే కార్డును రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ గురువారం జాతికి అంకితం చేశారు. ఏటిఎంలతోపాటు వ్యాపార ఔట్‌లెట్లు, ఆన్‌లైన్ విక్రయాల్లో పనిచేసే ఈ కార్డును రాష్టప్రతి భవన్‌లో జరిగిన వేడుకలో ఆవిష్కరించిన అనంతరం ప్రణబ్ ముఖర్జీ జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడారు.
వినియోగదారులకు చెల్లింపుల విషయంలో బహుళ ప్రయోజనాలను అందించే ఈ కార్డు.. నగదు లావాదేవీలను తగ్గించడమేగాక, సురక్షితమైన లావాదేవీలకు దోహదం చేస్తుందని ప్రణబ్ తెలిపారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) అభివృద్ధి చేసిన ఈ కార్డు ఐసిఐసిఐ, ఎస్‌బిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు తదితర బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీల నిమిత్తం వినియోగించవచ్చు. భారత్‌లో ఈ కార్డు ప్రారంభంతో ప్రపంచంలో ఈ తరహా కార్డులను పరిచయం చేసిన దేశాల సంఖ్య ఏడుకు చేరింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications