బెంగళూరు/హైదరాబాద్: జాన్ డిస్టిల్లరీస్ ప్రైవేట్ లిమిటెడ్(జెడిపిఎల్)కు చెందిన రౌలెట్ బ్రాందీకి అంబ్రేసియా అవార్డ్స్ 2014లో భాగంగా ‘ప్యాకెజింగ్‌లో ఎక్స్‌లెన్స్ అవార్డు'-కాన్సిస్టర్(ప్రీమియం) దక్కింది. ఈ సంస్థ తరపున జెడిపిఎల్ బ్రాండ్ మేనేజర్ పుందిక్ కుల్బర్గి అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును గుర్గావ్‌లోని క్రౌనే ప్లాజాలో ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందజేశారు. ఈ అవార్డులు ఐఎన్‌డిఎస్‌పిఐఆర్ఐటిచే ఈ సంవత్సరమే ప్రవేశపెట్టబడ్డాయి.
దేశంలోని ప్యాకేజింగ్ పరిశ్రమకు చెందిన అత్యున్నత సంస్థ ‘ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్' డైరెక్టర్ ఫ్రొఫెసర్ ఎన్‌సి సాహా.. రౌలెట్ సంస్థను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. వివిధ అంశాల ప్రాతిపదికన ఈ సంస్థను ఎంపిక చేసి, రౌలెట్ బ్రాండ్ ప్యాకేజింగ్‌లో అన్నిటికన్నా ముందు ఉన్నట్లు నిర్ధారించారు.

ఈ సందర్భంగా జాన్ డిస్టిల్లరీస్ ఛైర్మన్ పాల్ పి జాన్ మాట్లాడుతూ.. అల్కాహాల్ బెవరేజ్ పరిశ్రమలో ప్రీమియంకు చాలా డిమాండ్ ఉండనుందని చెప్పారు. చాలా కాలంగా కొనసాగుతున్న బ్రాందీని నవీకరించి ప్రీమియం చేయాల్సిన అవకాశం వచ్చిందని తెలిపారు. అవార్డు గెలుచుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డు తమ బాధ్యతను మరింతగా పెంచిందని అన్నారు.
తాము ఎంతో జాగ్రత్త తీసుకుని తమ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని చెప్పారు. తమ ఉత్పత్తుల తయారీలో నాణ్యతను, అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నామని చెప్పారు. సహజ సిద్ధంగా తమ ఉత్పత్తులుంటాయని, ప్యాకేజింగ్‌లో కూడా మంచి ప్రమాణాలను పాటిస్తున్నామని జెడిపిఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేబబ్రత బెనర్జీ చెప్పారు. ఈ కార్యక్రమంలో మరికొన్ని సంస్థలకు వాటి సామర్థ్యాన్ని కూడా అవార్డులు అందజేశారు. వీర్ సాంఘ్వి, త్రిలోక్ దేశాయి, భావ్య దేశాయి, అభయ భార్గవలు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications