సుబ్రతాకు చుక్కెదురు: బెయిల్ పిటిషన్ తిరస్కరణ

ఇన్వెస్టర్లకు తమ సొమ్మును తిరిగి చెల్లించలేకపోయిన కారణంగా గత మార్చి 4 నుంచి సుబ్రతా రాయ్ ఢిల్లీలోని జైల్లోనే ఉంటున్న విషయం తెలిసిందే. కాగా, ఇంతకుముందు కూడా సుబ్రతా బెయిల్ కోసం తక్షణం రూ.2,500 కోట్లు చెల్లిస్తామని సుప్రీం కోర్టుకు సహారా సంస్థ ప్రతిపాదించింది.
ఆయన విడుదలయిన తర్వాత మిగతాది చెల్లిస్తామని తెలిపింది. ఈ ప్రతిపాదలను కోర్టు తిరస్కరించింది. దాంతో సుబ్రతా విడుదలకు సహారా చేసిన యత్నం విఫలమైంది. మొదట రూ.2,500 కోట్లు చెల్లిస్తామని, సుబ్రతా బయటకు వచ్చిన తర్వాత రూ.25 వేల కోట్లు డిపాజిట్ చేస్తామని సహారా గ్రూప్ ప్రతిపాదించింది.
అందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించలేదు.
బెయిల్ కావాలంటే పదివేల కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని ఆయనను ఆదేశించింది. ఐదువేల కోట్ల రూపాయల నగదు, మరో ఐదువేల కోట్ల రూపాయల బ్యాంకు గ్యారెంటీ చూపించాలని సుప్రీం కోర్టు సుబ్రతా రాయ్‌ను ఆదేశించింది.


Click it and Unblock the Notifications