న్యూఢిల్లీ: దేశీయ ప్రైవేట్ రంగ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ కమ్యునికేషన్స్ ఏకీకృత నికర లాభాలు ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో 48.5 శాతం క్షీణించి 156 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. అనిల్ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ గత ఏడాది జనవరి-మార్చిలో 303 కోట్ల రూపాయల నికర లాభాలను అందుకోవడం గమనార్హం. ఆదాయం మాత్రం 5.36 శాతం పెరిగి 5,405 కోట్ల రూపాయలుగా నమోదైంది.
అంతకుముందు 5,130 కోట్ల రూపాయలుగా ఉందని శుక్రవారం ఆర్‌కాం తెలిపింది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభాలు 55.8 శాతం పెరిగి 1,047 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు 672 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం కూడా 3.29 శాతం పెరిగి 21,238 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇది ఇలా ఉండగా రిలయన్స్ క్యాపిటల్ నికర లాభాలు ఈ మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో 267 కోట్ల రూపాయలుగా నమోదైంది.

నిరుడు ఇదే కాలంలో 265 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు శుక్రవారం ఆ సంస్థ పేర్కొంది. ఆదాయం కూడా 1,691 కోట్ల రూపాయల నుంచి 1,848 కోట్ల రూపాయలకు చేరింది. మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో లాభాలు 9 శాతం క్షీణించి 747 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. అంతకుముందు 812 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఆదాయం మాత్రం 6,636 కోట్ల రూపాయల నుంచి 7,544 కోట్ల రూపాయలకు పెరిగింది.
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐదో రోజు నష్టాలను నమోదు చేస్తూ శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 13.91 పాయింట్లు క్షీణించి, రెండు వారాల కుపైగా కనిష్ట స్థాయిని తాకుతూ 22,403.89 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 1.60 పాయింట్లు నష్టపోయి 6,694.80 వద్ద స్థిరపడింది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గరపడుతున్నకొద్ది మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. లార్సెన్, ఎస్‌ఎస్‌ఎల్‌టి, టాటా స్టీల్, హిందాల్కో, మారుతి సుజుకి, ఎస్‌బిఐ షేర్లు 2.50 శాతం నుంచి 1.59 శాతం పడిపోయాయి. అయినప్పటికీ టాటా పవర్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, హెచ్‌డిఎఫ్‌సి, విప్రో షేర్లు 2.43 శాతం నుంచి 1.07 శాతానికి పెరిగాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications