న్యూఢిల్లీ: భారత్ వృద్ధిపథంలో పయనిస్తోందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. బుధవారం జరిగిన ప్రణాళికా సంఘం సభ్యుల సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్ తన తుది ప్రసంగం చేశారు. భారత్ మళ్లీ అభివృద్ధి పథంలో నడుస్తోందని తెలిపారు. అయితే ఇంకా కొంత స్తబ్ధత ఉందని.. అది కూడా పోవాల్సి ఉందని అని ప్రణాళికా సంఘం అధ్యక్షుడి హోదాలో ఉన్న మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.
స్వేచ్ఛగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికా సంఘం పాత్ర ప్రతిబింబించేలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గడిచిన పదేళ్ల కాలంలో యూపిఏ పాలనలో ప్రణాళికా సంఘం పనితీరుపై ఈ సందర్భంగా మన్మోహన్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇకముందూ దేశ అభివృద్ధిలో, ప్రభుత్వ విధానాల్లో ఇలాగే ప్రణాళికా సంఘం భాగస్వామ్యయుతంగా ఉండాలని ఆకాంక్షించారు.

ప్రస్తుత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ.. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన నుంచి తనకెంతో మద్దతు లభించిందని ఈ సందర్భంగా మన్మోహన్ గుర్తుచేసుకున్నారు. ఈ పదేళ్ల కాలంలోనూ ప్రణాళికా సంఘం ప్రభుత్వానికి అభివృద్ధి విషయంలో ఎంతో సహకారాన్ని అందించిందని చెప్పారు.
కాగా, ప్రణాళికా సంఘంతో మన్మోహన్ అనుబంధం 1980 ఏప్రిల్‌లో మొదలైంది. నాడు కార్యదర్శిగా పనిచేసిన ఆయన తదనంతర కాలంలో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అంతేగాక 1991, 1996 మధ్య కాలంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా కూడా మన్మోహన్ సింగ్ పని చేశారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications