రాయితీలతో రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి: జయేష్
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాలకు కేంద్రం నుంచి అనేక పన్ను రాయితీలు వస్తాయని, దీని వల్ల రెండు రాష్ట్రాల్లో పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందుతాయని ఏపిఐఐసి సిఎండి జయేష్ రంజన్ అన్నారు. ఆదివారం ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌ఓ), యుంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
కేంద్రం ఇచ్చే రాయితీలు, ఐదు సంవత్సరాల పాటు కేంద్ర ఎక్సైజ్ పన్ను మాఫీ వల్ల పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల ఏర్పాటుకు మంచి అవకాశం లభిస్తుందని జయేష్ రంజన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరిశ్రమలకు వచ్చే రాయితీలను వివరిస్తూ మహిళా పారిశ్రామికవేత్తలను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత 40 సంవత్సరాల్లో ఏపిఐఐసి 29,400 పారిశ్రామిక ప్లాట్స్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఇందులో 1380 ప్లాట్స్‌ను మహిళలకు కేటాయించినట్లు తెలిపారు.

ఏపిఐఐసికి మూడు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో గాజులరామారం, మేడ్చల్, విజయవాడ పారిశ్రామికవాడలో మహిళలకు ప్రత్యేకంగా ప్లాట్లను ఏర్పాటు చేశామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించడం, శిక్షణ ఇవ్వడం, ప్రాజెక్టు రిపోర్టులను తయారు చేయడం లాంటి అంశాలపై శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎల్‌ఓ హైదరాబాద్ చాప్టర్ చైర్‌పర్సన్‌గా మోనికా అగర్వాల్ బాధ్యతలు చేపట్టారు.
ఇండోర్‌లోని ఐఐఎం సంస్ధ నుంచి ఆమె ఎంబిఏ చేశారు. యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్‌పర్సన్(వైఎఫ్ఎల్ఏ)గా శకుంతలా దేవి బాధ్యతల స్వీకరించారు. ఎఫ్‌ఎల్‌ఒ సీనియర్ చైర్‌పర్సన్‌గా రేఖా లాహోటీ, సెక్రటరీగా మాన్సి మాలిక్, సంయుక్త కార్యదర్శిగా సిహెచ్ సుమలత, కోశాధికారిగా ఉషా రాణి బాధ్యతలు స్వీకరించారు. వైఎఫ్‌ఎల్‌ఓ వైస్‌చైర్‌పర్సన్‌గా సామియా ఆల్మ్ ఖాన్, కార్యదర్శిగా నిధి స్వరూప్, కోశాధికారిగా రీతూ షా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని ఏపిఐఐసి సిఎండి జయేష్ రంజన్ అభినందించారు.


Click it and Unblock the Notifications