హైదరాబాద్/న్యూఢిల్లీ: హైదరాబాద్ నగరంలోని బేగంపేట్ వైట్‌హౌస్‌లోని లాట్ స్టోర్‌లో ప్రముఖ టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ సోమవారం సందడి చేశారు. వినియోగదారులు ముందుగా బుక్ చేసుకున్న 258 బ్లాక్ బెర్రీ జడ్10 మొబైళ్లను అందజేశారు. బ్లాక్ బెర్రీ జడ్10పై వినియోగదారులకు లాట్ అందించిన పదవ వార్షికోత్సవ ఆఫర్లకు అద్భుత స్పందన వచ్చిందని లాట్ నిర్వాహకులు తెలిపారు.
అయితే లాట్ అందిస్తున్న ఈ ఆఫర్ సోమవారంతో ముగిసిందని చెప్పారు. భారత మార్కెట్లో బ్లాక్ బెర్రీ యొక్క అంకిత భావాన్ని చాటి చెప్పడానికి, బ్లాక్ బెర్రీపై నమ్మకం కలిగిన బ్లాక్ బెర్రీ లాట్ వినియోగదారులకు ప్రత్యేక అనుభవాన్నిచ్చే లక్ష్యంతో బ్లాక్ బెర్రీ జడ్10ను ఆఫర్ ధరలతో అందిస్తున్నామని పేర్కొన్నారు.

భారత్‌లో ఐఫోన్లకు భలే గిరాకీ
న్యూఢిల్లీ: భారత్‌లో గత ఏడాది ఐఫోన్ల అమ్మకాలు 55 శాతం పెరిగాయని యాపిల్ సంస్థ సిఈఓ టిమ్ కుక్ స్వయంగా వెల్లడించారు. రెండో త్రైమాసికంలో యాపిల్ సంస్థ సాధించిన ఫలితాలను వివరిస్తూ ఆయన ఈ విషయాన్ని చెప్పారు. అయితే భారత్‌లో గత ఏడాది అమ్మిన ఐఫోన్ల సంఖ్యను ఆయన వెల్లడించలేదు. భారత్‌తో పాటు ఇతర వర్థమాన మార్కెట్లలో కూడా ఐఫోన్లకు గిరాకీ బాగా పెరిగిందని, ముఖ్యంగా వియత్నాంలో 262 శాతం, రష్యాలో 97 శాతం, బ్రెజిల్‌లో 61 శాతం, టర్కీలో 56 శాతం అమ్మకాలు పెరిగాయని ఆయన వివరించారు.
కాగా, గత ఏడాది సెప్టెంబర్‌లో డిస్‌కంటిన్యూ చేసిన ఐఫోన్-4ను మళ్లీ భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టిన యాపిల్ సంస్థ మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో అమ్మకాలను పెంచుకోవడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఐఫోన్-4 ధరను 22,990 రూపాయలుగా నిర్దేశించారు. మార్కెట్‌లో ప్రస్తుతం అత్యంత చౌక ధరకు లభిస్తున్న ఐఫోన్ ఇదే. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ భారత మార్కెట్‌లో ఇతర మోడళ్ల ఐఫోన్ల ధరలు కూడా తగ్గాయి. ఆరంభంలో 53,500 రూపాయల ధర నిర్ణయించిన ఐఫోన్-5ఎస్ బేస్ వేరియంట్ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో 47 వేల రూపాయలకే లభ్యమవుతోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications