ముంబై/హైదరాబాద్: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ స్టాండలోన్ నికర లాభాలు గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 15 శాతం వృద్ధి చెందాయి. జనవరి-మార్చి త్రైమాసికంలో 2,652 కోట్ల రూపాయల లాభాలను ఐసిఐసిఐ అందుకుంది. ఏకీకృత లాభాల ప్రకారం 9 శాతం వృద్ధితో 2,724 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. నికర వడ్డీ ఆదాయం 15 శాతం పెరిగి 4,357 కోట్ల రూపాయలుగా ఉంది.
వడ్డీయేతర ఆదాయం 35 శాతం ఎగబాకి 2,976 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇక మొత్తం గత ఆర్థిక సంవత్సరం 2013-14లో బ్యాంక్ లాభాలు 15 శాతం వృద్ధి చెంది 11,041 కోట్ల రూపాయలుగా నిలిచాయి. ఈ మేరకు శుక్రవారం ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సిఈఓ చందా కొచ్చర్ ఆర్థిక ఫలితాల వివరాలను వెల్లడించారు. ఫీజుల ఆదాయం 12 శాతం పెరిగి 1,974 కోట్ల రూపాయలకు చేరగా, ఖజానా ఆదాయం 245 కోట్ల రూపాయల వద్ద నిలిచింది. అనుబంధ సంస్థల నుంచి వచ్చిన డివిడెండ్ 541 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు కొచ్చర్ ఈ సందర్భంగా తెలిపారు.

మరో ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ మార్చితో ముగిసిన మూడు నెలలకు రూ. 1,842 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం నికర లాభం రూ. 1,555 కోట్లతో పోలిస్తే ఇది 18 శాతం అధికమని బ్యాంకు పేర్కొంది. వడ్డీ, రుసుము ఆధారిత ఆదాయాలు పెరగడం నికర లాభం పెరగడానికి దోహదం చేశాయని వెల్లడించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికి నికర వడ్డీ ఆదాయం 19శాతం పెరిగి రూ. 2,665 కోట్ల నుంచి రూ. 3,166 కోట్లకు చేరగా.. నికర వడ్డీ మార్జిన్ 3.89 శాతానికి పెరిగింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 3.70 శాతం ఉంది. బ్యాంకు ఆదాయం రూ. 9,054.72 కోట్ల నుంచి రూ. 10,178.63 కోట్లకు పెరిగింది.
17శాతం వృద్ధి నమోదు చేసిన ఎస్‌బిహెచ్
హైదరాబాద్: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్) నికర లాభాలు ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో 17 శాతం వృద్ధి చెంది 444 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే వ్యవధిలో 380 కోట్ల రూపాయల నికర లాభాలను ఎస్‌బిహెచ్ అందుకుంది. ఈ మేరకు శుక్రవారం ఇక్కడ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎమ్ భగవంతరావు తెలిపారు. ఈసారి జనవరి-మార్చిలో నికర వడ్డీ ఆదాయం 2.3 శాతం పెరిగి 1,027 కోట్ల రూపాయలకు చేరింది.
గతంలో ఇది 1,004 కోట్ల రూపాయలుగా ఉంది. మరోవైపు బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు గతంతో పోల్చితే ఈ మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో 3,186 కోట్ల రూపాయల నుంచి 5,824 కోట్ల రూపాయలకు పెరిగాయి. కాగా, మొత్తం గత ఆర్థిక సంవత్సరం 2013-14లో నికర లాభాలు 18.4 శాతం క్షీణించి 1,250 కోట్ల రూపాయల నుంచి 1,020 కోట్ల రూపాయలకు దిగజారాయి. నికర వడ్డీ ఆదాయం మాత్రం స్వల్పంగా పెరిగి 3,918 కోట్ల రూపాయల నుంచి రూ. 3,976 కోట్లకు చేరింది.
హైదరాబాద్‌లో ఐసిఎస్‌ఐ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్
హైదరాబాద్‌లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఐసిఎస్‌ఐ జాతీయాధ్యక్షుడు ఆర్ శ్రీధరన్ ప్రకటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఐసిఎస్‌ఐ కంపెనీ సెక్రటరీస్ కోసం ఈ తరహా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీని కోసం 20 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు తెలిపారు. ఉప్పల్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. వచ్చే రెండేళ్లలో సెంటర్ పని ప్రారంభమవుతుంది. రెండవ కేంద్రాన్ని ముంబయిలో ఏర్పాటు చేస్తారు. దేశంలో ఐసిఎస్‌ఐలో 35వేల మంది సభ్యులున్నారని, నాలుగు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు.
టాటాకు డొకోమో గుడ్‌బై
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌తో నడిపిస్తున్న జాయింట్ వెంచర్ నష్టాలమయం కావడంతో ఈ వెంచర్ నుంచి జపాన్‌కు చెందిన టెలికాం దిగ్గజం ఎన్‌టిటి డొకోమో బయటకు వెళ్లాలనుకుంటోంది. ఇందులోభాగంగానే టాటా టెలీసర్వీసెస్‌లోని మొత్తం 26.5 శాతం వాటాను జూన్ వరకు అమ్మేయాలని ప్రయత్నిస్తున్నట్లు శుక్రవారం ఎన్‌టిటి డొకొమో తెలిపింది. తమ ఇన్వెస్ట్‌మెంట్‌తో పోలిస్తే భారీ నష్టాలకు వాటాలను విక్రయించి బయటపడేందుకు డొకోమో సిద్ధపడుతోంది.
టాటా గ్రూప్‌తో డొకోమో అనుబంధానికి ఐదేళ్ల చరిత్ర ఉంది. 2009లో టాటా గ్రూప్‌తో డొకోమో చేతులు కలిపింది. అప్పటి వరకు సిడిఎంఎ సర్వీసులకు పరిమితమై ఉన్న టాటా టెలిసర్వీసెస్ డొకోమో ప్రవేశంతో జిఎస్ఎం సర్వీసుల్లోకి అడుగుపెట్టింది. టాటా టెలి సర్వీసెస్‌కు అనుబంధంగా టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) లిమిటెడ్ పేరుతో మరో కంపెనీ ఉంది. ముంబై, మహారాష్ట్రకు పరిమితమైన ఈ కంపెనీ స్టాక్‌మార్కెట్లోనూ లిస్టయింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications