
గడిచిన ఆరు నెలల్లో డిపాజిట్ల ద్వారా భారత్‌లోకి దాదాపు 65 బిలియన్ డాలర్లను ఎన్‌ఆర్‌ఐలు పంపించారన్నారు. అయినప్పటికీ దేశాభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐలు చేస్తున్న కృషిని ప్రభుత్వం మరిచిపోతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రమాదకర స్థాయిలో నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ) పేరుకుపోయిన క్రమంలో ఇప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పిలుపుతో ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లోకి భారీగా నిధులను తరలిస్తున్నారని గుర్తుచేశారు.
1990 దశకంలో భారత ఆర్థిక విధానాలు సరళీకృతం చేసి విదేశీ పెట్టుబడులకు ఆర్థిక రంగాన్ని తెరిచినప్పుడు కూడా ఎన్ఆర్ఐలే దన్నుగా నిలిచారన్న సంగతి ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా ఎన్‌ఆర్‌ఐలు కూడా భారత్‌లో భాగమేనన్న సత్యాన్ని ప్రభుత్వాలు, ప్రజలు గుర్తిస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారత్‌లోని ప్రతి ఒక్కరు తాము భారతీయులమని గర్వపడాలని స్వరాజ్ పాల్ అన్నారు. ఇదిలావుంటే ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలపై స్పందిస్తూ భారతీయ ఓటర్లు లంచాలకు ప్రభావితం కాబోరన్నారు.
‘భారత్‌లోని పత్రికలైనా, ఐరోపా లేదా ప్రపంచంలోని ఏ దేశ మీడియా అయినా భారతీయ ఓటర్లు లంచాలు తీసుకుంటున్నారని అంటున్నాయి. ఇదంతా అబద్ధం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎవరికి ఓటేయాలనుకుంటారో వారికే ఓటేస్తారు. నా దృష్టిలో భారత్‌లో అసలైన విజేతలు ఓటర్లు మాత్రమే.' అని స్వరాజ్ పాల్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అన్న ఆయన, రాజకీయ పార్టీలు పేదరికం, విద్య వంటి వాస్తవిక అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications