న్యూఢిల్లీ: రిలయెన్స్ ఇండస్ట్రీస్ గత రెండేళ్లలోనే అత్యధిక త్రైమాసిక లాభాన్ని నమోదు చేసింది. పెట్రో రసాయనాల మార్జిన్లు భారీగా పెరగడం, రూపాయి క్షీణతతో ఎగుమతుల ఆదాయాలు రాణించడంతో ఇది సాధ్యమైంది. అంతేగాక సహజ వాయువు వ్యాపారంలో బలహీనతలను రూపాయి కప్పిపుచ్చగలిగింది. దీంతో గత నెలతో ముగిసిన మూడు నెలల కాలంలో 5,631 కోట్ల రూపాయల లాభాలను పొందిన రిలయన్స్.. గత ఏడాది ఇదే వ్యవధిలో 5,589 కోట్ల రూపాయల లాభాలను సాధించింది.
చమురు శుద్ధి వ్యాపారం నుంచి 12.3 శాతం పెరిగిన లాభాలు.. పెట్రోకెమికల్స్ వ్యాపారంలో 10.6 శాతం పెరిగాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బలహీనపడటంతో ఎగుమతులూ లాభించాయి. గత ఏడాది జనవరి-మార్చిలో 54.20 పైసలు పలికిన రూపాయి మారకం విలువ.. ఈ ఏడాది జనవరి-మార్చిలో 61.80 పైసలకు క్షీణించాయి. కాగా, చమురు, గ్యాస్ వ్యాపారంలో మాత్రం 17.8 శాతం లాభాలు క్షీణించాయి. కృష్ణా-గోదావరి బేసిన్‌లో తగ్గిన ఉత్పత్తే కారణమని రిలయన్స్ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది.

ఇక ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్‌ను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్వహిస్తున్న రిలయన్స్.. ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో ఇక్కడ ఇంధనంగా మారిన ప్రతి బ్యారెల్ ముడిచమురుపై 9.3 బిలియన్ డాలర్లను అందుకుంది. అంతకుముందు త్రైమాసికం అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 7.60 శాతం ఉండగా, గత ఏడాది జనవరి మార్చిలో 10.1 శాతంగా ఉంది. ఇదిలావుంటే అమ్మకాలు 13 శాతం వృద్ధితో 97,807 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి.
ఇక మొత్తం ఆర్థిక సంవత్సరం 2013-14లో సంస్థ నికర లాభం 21,984 కోట్ల రూపాయలకు చేరింది. ప్రైవేట్‌రంగంలోని ఓ సంస్థ ఇంతటి భారీ స్థాయిలో నికర లాభాలు అందుకోవడం ఇదే. 2012-13లో ఇది 21,003 కోట్ల రూపాయలుగా ఉంది. సంస్థ టర్నోవర్ కూడా రికార్డు స్థాయిలో 8.1 శాతం పెరిగి 4,01,302 కోట్ల రూపాయలను తాకింది. అంతకుముందు 3,71,119 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ‘2013-14 ఆర్థిక సంవత్సరం సంతృప్తికరంగా సాగింది.' అని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చీఫ్ ముఖేష్ అంబానీ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షేల్ గ్యాస్ వెంచర్‌లో 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications