భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) ఇటీవల ఓ తాజా నిర్ణయం తీసుకుంది. 2005కు ముందు ముద్రించిన కరెన్సీ నోట్లను వెనక్కి(ఉపసంహరణ) తీసుకోవాలని నిర్ణయించింది. ప్రజలు తమ వద్ద ఉన్న 2005కు ముందు ముద్రించిన నోట్లను ఏప్రిల్ 1, 2014 నుంచి మార్చుకోవాలని కోరింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తమ వద్ద ఉన్న ఆ నోట్లను మార్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
2015, జనవరి 1 వరకు ఈ నోట్లను ఏ బ్యాంకులోనైనా ఉచితంగా మార్చుకోవచ్చని రిజర్వు బ్యాంకు తెలిపింది. 2015, జనవరి 1 తర్వాత నోట్లను మార్చుకోవాలనుకుంటే ఆ వివరాలను రిజర్వు బ్యాంకుకు తెలపాల్సి ఉంటుంది. అందుకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ నోట్లను వెనక్కి తీసుకోవాలని ఆర్‌బిఐ ఎందుకు నిర్ణయించింది?
భారత రిజర్వు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చిన వివరాల ప్రకారం.. కొన్ని భద్రతా పరమైన కారణాల వల్ల 2005కు ముందు ముద్రించిన కరెన్సీ నోట్లను వెనక్కి తీసుకోవడం జరుగుతోంది. 2005 తర్వాత ముద్రించిన నోట్లతో పోల్చితే ఆ(2005కు ముందు) నోట్లకు భద్రతాపరమైన తేడాలున్నాయి.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కరెన్సీ నోట్లును తీసుకురావడంలో భాగంగానే 2005కు ముందున్న నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 2005కు ముద్రించిన నోట్లు కూడా చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయని బ్యాంకు తెలిపింది. అంతేగాక బ్యాంకులు కూడా 2005కు ముందు ముద్రితమైన నోట్లను ఏటిఎంల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా జారీ చేయకూడదని ఆదేశించింది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications