న్యూఢిల్లీ: ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న సంకేతాలిచ్చిన పారిశ్రామికోత్పత్తి మళ్లీ క్షీణించింది. తయారీ రంగం, ముఖ్యంగా క్యాపిటల్ గూడ్స్ పేలవ ప్రదర్శనతో ఈ ఏడాది ఫిబ్రవరిలో -1.9 శాతానికి దిగజారింది. 2013 ఫిబ్రవరిలో ఇది 0.6 శాతం వృద్ధిలో ఉంది. శుక్రవారం కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఈ) ఈ మేరకు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య -0.1 శాతంగా నిలిచిన రిశ్రామికోత్పత్తి.. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 0.9 శాతం వృద్ధిని కనబరిచింది.
కాగా, జనవరిలో 0.8 శాతం వృద్ధిరేటుతో ఉన్న ఐఐపి.. ఫిబ్రవరిలో క్షీణించడం మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది మే నెలలో -2.5 శాతానికి పడిపోయిన ఐఐపి.. సెప్టెంబర్‌లో తిరిగి 2.7 శాతానికి పెరిగింది. ఐఐపిలో 75 శాతం వాటా కలిగిన తయారీ రంగం ఫిబ్రవరిలో -3.7 శాతానికి క్షీణించింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఇది 2.1 శాతం వృద్ధితో ఉంది. మరోవైపు పారిశ్రామికోత్పత్తి తగ్గిన నేపథ్యంలో తక్షణమే ఆర్‌బిఐ వడ్డీరేట్లు తగ్గించాలని పారిశ్రామిక రంగం డిమాండ్ చేసింది.

వృద్ధి రేటుకు ఎల్‌నినో భయం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎల్‌నినో దెబ్బకు భారత వృద్ధి రేటు 5 శాతానికి పడిపోవచ్చని అంచనా వేస్తున్నట్లు సింగపూర్ బ్రోకరేజ్ సంస్థ డిబిఎస్ వెల్లడించింది. ఎల్‌నినో కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవటంతో పాటు ఈశాన్య రుతుపవనాలు ఆశించిన స్థాయిల్లో ఉండకపోవచ్చని దీంతో వృద్ధి రేటుకు గండి పడనుందని పేర్కొంది. అంతేకాకుండా ఎల్‌నినో కారణంగా ద్రవ్యోల్బణం 8.5 శాతానికి పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంది.
వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) వచ్చే ఏడాది జనవరి నాటికి 8 శాతానికి చేరుకోవటంలో ఎల్‌నినో కీలకంగా ఉండనుందని తెలిపింది. అంతేకాకుండా ఆహార ధరల్లో పెరుగుదలతో టోకు ధరల సూచీ గరిష్ఠ స్థాయిలకు చేరుకుంటుందని డిబిఎస్ తన నోట్‌లో పేర్కొంది. ద్రవ్యోల్బణంలో వృద్ధి కారణంగా రిజర్వు బ్యాంకు భవిష్యత్తులో వెలువరించే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేపట్టకపోవచ్చని భావిస్తున్నట్లు డిబిఎస్ వెల్లడించింది. కాగా, భారత ఆర్థిక వ్యవస్థపై ఎల్‌నినో ప్రభావం చూపే అవకాశం ఉందని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) తన ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications