
భారత్, చైనా, మెక్సికో, బ్రెజిల్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ట్యునిషియా దేశాల మీడియా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇది భారత్‌పట్ల ప్రైవేటు సంస్థలకున్న ప్రత్యక్ష అభిప్రాయమని, ఈ సంగతి భారత ప్రభుత్వానికి బాగా తెలుసని, ఇప్పుడిప్పుడే భారత్‌లో ప్రభుత్వాలు ఈ పరిస్థితిని మార్చేందుకు యత్నిస్తున్నాయని కిమ్ తెలిపారు. ఈ సందర్భంగా భారత్ ప్రధాని మన్మోహన్, ఆర్థిక మంత్రి చిదంబరం, రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు.
వీరందరికి భారత్‌లో నెలకొన్న సమస్యల పట్ల విస్తృత అవగాహనుందని, ఈ సమస్యల పరిష్కారానికి ఏం చేయాలో వీరికి బాగా తెలుసని ఆయన తెలిపారు.
ఇప్పటికే ఆర్‌బిఐ గవర్నర్ కొన్ని ఆర్థిక సంస్కరణలు ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో ప్రభుత్వ పరమైన నియంత్రణలను సరళీకరిస్తే ప్రైవేటు రంగం పెట్టుబడుల వరద ప్రవహింపజేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యావ్యవస్థ మెరుగుదలపై భారత్ అధిక దృష్టి పెట్టడం లేదన్న కిమ్, ఆర్థికాభివృద్ధికి విద్యావైద్య రంగాలపై పెట్టుబడులు పెట్టడం ఎంతో అవసరమని తెలిపారు. ఈ విషయాన్ని భారత్ అర్ధం చేసుకొని, ఇప్పుడిప్పుడే ఈ రంగాలపై పెట్టుబడులు పెంచుతోందని ఆయన అన్నారు. భారత్‌లో వైద్యరంగాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు భారత్ ఇంకా అనేక చర్యలు చేపట్టాల్సిఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అతితక్కువ వడ్డీకి దొరికే లక్షలాది డాలర్ల మూలధనం ఊరకనే పడిఉందని, ఈ నిధులను ఆకర్షించేందుకు భారత్ వివిధ విధాన చర్యలను చేపట్టాలని ఆయన సూచించారు. ప్రపంచంలో వివిధ ఫండ్లు, ప్రైవే టు వర్గాలు భారత్‌లో, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టేందుకు ఎదురు చూస్తున్నారని, అయితే ఈ ప్రాంతాల్లో వ్యాపార వాతావరణం తామూహించినట్లు లేదని వారు ఆందోళన చెందుతున్నారని, తమ పెట్టుబడులకు రక్షణ లభిస్తుందో లేదోనని వారు తేల్చుకోలేకపోతున్నారని ఆయన తెలిపారు.
ఈ పరిస్థితుల్లో వర్ధమాన దేశాలు తమ ప్రభుత్వ నియంత్రణలను సరళీకరించాలని, తద్వారా ప్రైవేటు రంగం అభివృద్ధి చెందేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. గత 20 ఏళ్లుగా అభివృద్ధి ద్వారా పేదరికాన్ని పారదోలడంలో దాదాపు 75 శాతం విజయం సాధించామని, మిగిలిన పేదరికాన్ని పునఃపంపిణీ ద్వారా సాధించామని, దీన్ని బట్టి అభివృద్ధిని సాధించడం అత్యావశ్యకమని ఆయన అన్నారు. ఈ విషయంలో రెండు అంశాలున్నాయని, మెదటి దాని కోసం ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం, రెండవ దాని కోసం విద్యావైద్య రంగాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధి సాధించవచ్చని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications