
మార్కెట్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యవహరిస్తున్న తమ సామర్థ్యానికి నిదర్శనమే ఈ ఫలితాలని నందగోపాల్ అన్నారు. తమ వినియోగదారులు కూడా తమపై నమ్మకముంచి తమ సంస్థ వృద్ధిలో భాగస్వాములయ్యారని తెలిపారు. భవిష్యత్‌లో వినియోగదారులకు మరింత చేరువగా తమ ఉత్పత్తులను, సేవలను తీసుకెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. వినియోగదారులకు ఉత్తమ సేవలందించటమే తమ లక్ష్యమని నందగోపాల్ తెలిపారు.
సుమారు 2.4 మిలియన్ల జీవితాలను తమ కంపెనీ కవర్ చేసిందని, 2013-14 సంవత్సరానికి రూ. 6,500 కోట్లుగా ఏయుఎం(అస్సెట్స్ అండర్ మేనేజ్‌మెంట్) ఉందని తెలిపారు. ప్రస్తుతం నాలుగు కీలక వ్యాపార విభాగాలు ఆరోగ్యం, భద్రత, పొదు, సంపదలను వినియోగదారుల ముందుకు తీసుకువస్తున్నట్లు చెప్పారు. పెన్షన్, మైక్రో-ఇన్స్యూరెన్స్ సెగ్మెంట్లలో కూడా తమదైన ముద్ర వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.
పరిశ్రమల్లో పని చేస్తున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలపై దృష్టి సారిస్తున్నట్లు నందగోపాల్ తెలిపారు. మైక్రో ఇన్స్యూరెన్స్ ద్వారా ప్రజల వద్దకు తమ సేవలను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. డిజిటల్, కార్పొరేట్ వ్యాపాలరను విస్తరించడం ద్వారా ఇండియాఫస్ట్ తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.
2009-10లో సంస్థ ప్రారంభించిన 200 రోజుల్లోనే రూ. 200 కొత్త వ్యాపార ప్రీమియంను సాధించినట్లు తెలిపారు. ఆ వృద్ధి అదేవిధంగా కొనసాగి 2010-11లో రూ. 704 కోట్లు, 2011-12లో రూ. 982 కోట్లు, 2012-13లో 1316 కోట్లకు చేరుకుందని పేర్కొన్నారు. ఇండియాఫస్ట్ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో నూతన సాంకేతికతను ఉపయోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అన్ని పాలసీలను డిమేటిరియలైజ్డ్ ఫార్మాట్లోనే అందిస్తున్నట్లు చెప్పారు. అందువల్ల 2013 ఇండియన్ ఇన్స్యూరెన్స్ అవార్డ్స్ ‘మ్యాజిక్ బోర్డ్'లో టెక్నాలనజీ ఇన్నోవేషన్ అవార్డును సాధించినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఇండియాఫస్ట్ దేశంలోని 1000కి పైగా నగరాల్లో 8వేలకు పైగా భాగస్వామ్య బ్యాంక్ (బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్రా బ్యాంక్), ఆర్‌ఆర్‌బి బ్రాంచుల ద్వారా సేవలందిస్తోంది. 2009, నవంబర్ 16న ప్రారంభమైన ఇండియాఫస్ట్.. సరసమైన ధరలలో తన ఉత్పత్తులను, సేవలను ప్రజలకు అందిస్తోంది. అంతేగాక ఈ కంపెనీ గొప్ప పని స్థలాలు కలిగిన వంద కంపెనీల్లో ఒకటిగా ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications