సుబ్రతా రాయ్: గృహ నిర్బంధానికి కోర్టు నిరాకరణ

ఈ ప్రతిపాదనను తిరస్కరించడంతో కనీసం ఇంటి నుంచి తెచ్చిన భోజనమైనా తినడానికి అనుమతించాలని.. జైలు నుంచి మరిన్ని ఫోన్లు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని రాయ్ తరపు న్యాయవాది కోరారు. దీనిపై సుప్రీం కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా.. ఈ పిటిషన్ విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. మదుపరుల నుంచి సమీకరించిన నిధులను తిరిగి చెల్లించడం కోసమే రాయ్‌కు జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు కోర్టు పేర్కొంది.
కాగా, కోర్టు ఆదేశాల మేరకు మదుపర్లకు చెల్లించాల్సిన డబ్బులు పెద్దమొత్తంలో ఉండటంతో వాటిని సమకూర్చుకునేందుకు సహారా గ్రూప్ తమ ఆస్తుల విక్రయానికి సిద్ధమైంది. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ కొనుగోలుదారులతో సంప్రదింపులు జరుపుతున్న సహారా.. అమ్మకానికి అధినేత అవసరం తప్పనిసరి అని చెబుతోంది. దీంతో కొనుగోలుదారులు జైలుకు వచ్చి రాయ్‌తో సంప్రదింపులు జరపలేరని, కాబట్టి ఆయనను గృహ నిర్బంధానికి ఇవ్వాలని సహారా తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ప్పటికే కొందరు కొనుగోలుదారులు సంప్రదిస్తున్నారని, అయితే తీహార్ జైలు పరిస్థితి దృష్ట్యా వారిని జైలుకు తీసుకెళ్లలేకపోతున్నామని పిటిషన్‌లో జెఠ్మలానీ పేర్కొన్నారు. 500 మంది ఖైదీలు మాత్రమే ఉండాల్సిన తీహార్ జైలులో ప్రస్తుతం 1,300 మంది ఉన్నారని గుర్తుచేశారు. అయితే సుబ్రతా రాయ్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని, అంటే కోర్టు కస్టడీలో ఉన్నట్లేనని కాబట్టి గృహ నిర్బంధం కుదరదని జస్టిస్ కెఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జెఎస్ కెహర్‌లతో కూడిన అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇంతకుముందు సుబ్రతా రాయ్‌ని బెయిల్‌పై విడుదల చేసేందుకు సుప్రీం కోర్టు 10,000 కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాల్సి ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో 5,000 కోట్ల రూపాయలు బ్యాంక్ పూచీకత్తుగా, మరో 5,000 కోట్ల రూపాయలను నగదుగా డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. అయితే ఇంత పెద్దమొత్తంలో ఇప్పటికిప్పుడు సర్దుబాటు చేయలేమని చేతులెత్తేసిన సహారా.. కొంత మొత్తం ముందు చెల్లిస్తామని, ఆ తర్వాత మిగతాది ఇస్తామంటూ ప్రతిపాదించింది. దీన్ని సుప్రీం తోసిపుచ్చింది. దీంతో ఈ ప్రతిపాదనను కూడా సహారా ఉపసంహరించుకుంది.


Click it and Unblock the Notifications