న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: దేశీయ ఫార్మా రంగంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటైన సన్‌ఫార్మా ప్రధాన ప్రత్యర్థి సంస్థ రాన్‌బాక్సీని త్వరలోనే సొంతం చేసుకోనుంది. 320 కోట్ల డాలర్ల (20 వేల కోట్ల రూపాయలు) ఆల్ స్టాక్ డీల్‌లో ప్రస్తుతం జపాన్ కంపెనీ దైచీ సాంక్యో చేతుల్లో ఉన్న రాన్‌బాక్సీని టేకోవర్ చేయనున్నట్టు సన్ ఫార్మా ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని రాన్‌బాక్సీ కూడా ధృవీకరించింది. ఈ టేకోవర్(కొనుగోలు)తో భారత్‌లో అతిపెద్ద ఔషధ రంగ సంస్థగా, ప్రపంచంలో ఐదో అత్యంత భారీ ఔషధ సంస్థగా సన్ ఫార్మా ఆవిర్భవించనుంది.
సంయుక్తంగా ఈ రెండు సంస్థల ఆదాయం 4.2 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఓ అంచనా. ఈ సందర్భంగా సన్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ షాంఘ్వీ మాట్లాడుతూ.. అమెరికా, భారత్‌లలో పెద్ద ఎత్తున వ్యాపారాన్ని చేస్తూ మంచి మార్కెట్‌ను కలిగి ఉన్న రాన్‌బాక్సీ కొనుగోలుతో అద్భుత వృద్ధి అవకాశాలున్నాయని అన్నారు. సన్ ఫార్మాకు సైతం అమెరికా మార్కెట్ ముఖ్యమైనదైన నేపథ్యంలో ఈ కొనుగోలు ఒప్పందంతో విస్తృతమైన లాభాలున్నాయని వివరించారు. ఇరు సంస్థల కలయికతో తమ వ్యాపారం మరింత బలోపేతమవుతుందన్నారు.
కాగా, జపాన్‌కు చెందిన డైచి సాంక్యో ఆధ్వర్యంలో నడుస్తున్న రాన్‌బాక్సీ.. భారత్‌లో తమకున్న మొత్తం నాలుగు ఔషధ తయారీ ప్లాంట్లలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నాణ్యతాపరమైన సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ ప్లాంట్లలో జరిగిన ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి కాకుండా నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. మరోవైపు ఈ లావాదేవీలకు ముందు రాన్‌బాక్సీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న సన్ ఫార్మాకు చెందిన కర్ఖడీ ప్లాంట్‌పై కూడా అమెరికా నుంచి ఇదే రకమైన నిషేధాజ్ఞలున్నాయి.

ఈ నేపథ్యంలో రాన్‌బాక్సీని సన్‌ఫార్మా చేజిక్కించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఈ కొనుగోలు ఒప్పందంలో భాగంగా రాన్‌బాక్సీ భాగస్వాములు తమ ఒక్కో షేర్‌కు బదులుగా సన్ ఫార్మాకు చెందిన 0.8 షేర్‌ను పొందనున్నారు. ప్రస్తుతం ఈ రెండు సంస్థలు 65 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఐదు ఖండాల్లో విస్తరించిన ఈ సంస్థల వ్యాపారానికితోడుగా ఆయా దేశాల్లో 47 ఔషధ తయారీ కేంద్రాలు కూడా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా జనరిక్ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో సన్ ఫార్మా, రాన్‌బాక్సీ సంస్థలు దూసుకెళ్తున్నాయి.
కాగా, రాన్‌బాక్సీలోని ప్రధాన ప్రమోటర్లు మల్విందర్, శివిందర్ సింగ్ సంస్థ నుంచి తప్పుకున్న తర్వాత 2008లో జపాన్‌కు చెందిన డైచి సాంక్యో 22,000 కోట్ల రూపాయలతో రాన్‌బాక్సీలో మెజారిటీ వాటాను దక్కించుకుంది. ఇప్పుడు పూర్తిగా రాన్‌బాక్సీ సంస్థను సన్ ఫార్మా కొనుగోలు చేస్తోంది. ఈ ప్రతిపాదిత ఒప్పందానికి ఇరు సంస్థల బోర్డులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి.
రాన్‌బాక్సీ లాబొరేటరీస్‌లో 63.4 శాతం వాటా ఉన్న డైచి సాంక్యో, సన్ ఫార్మాసూటికల్ ఇండస్ట్రీస్‌లో 63.7 శాతం వాటా ఉన్న సన్ ఫార్మా ప్రమోటర్లు కొనుగోలు ఒప్పందానికి మద్దతు పలికారు.
అంతేగాక సంస్థలోని భాగస్వాముల ఆమోదానికి ఈ ఒప్పందాన్ని ఆయా సంస్థల బోర్డులు సిఫార్సు చేశాయి. రాన్‌బాక్సీ లాబొరేటరీస్‌ను కొనుగోలు చేస్తున్నట్లు సోమవారం సన్ ఫార్మాసూటికల్ ఇండస్ట్రీస్ ప్రకటించిన తర్వాత స్టాక్‌మార్కెట్లలో రాన్‌బాక్సీ షేర్ల విలువ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెన్సెక్స్‌లో దాదాపు 4 శాతం క్షీణించింది. మరోవైపు సన్ ఫార్మాసూటికల్ మదుపర్లు ఉత్సాహంతో కొనుగోళ్లకు సిద్ధపడటంతో ఆ సంస్థ షేర్ విలువ పెరిగింది. 2.68 శాతం మేర పుంజుకుంది. ఫలితంగా సెన్సెక్స్‌లో సన్ ఫార్మా షేర్ విలువ 587.25 రూపాయల వద్ద ముగిసింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications