సేవ కోసం టైం కేటాయిస్తా: సమంత (పిక్చర్స్)
హైదరాబాద్: తనకు వీలు దొరికినప్పుడల్లా సామాజిక సేవ చేసేందుకు సమయం కేటాయిస్తానంటోంది ప్రముఖ దక్షిణాది నటి సమంత. ఆమె నిర్వహిస్తున్న సమంత ప్రత్యూష సపోర్ట్ స్వచ్ఛంద సేవా సంస్థతో.. సోమవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని లివ్ లైఫ్ ఆస్పత్రి చేతులు కలిపింది. లివ్ లైఫ్ ఆస్పత్రి ఎండి నందకిషోర్ దుక్కపాటి, డాక్టర్ అనగాని మంజులతో కలిసి ఈ వివరాలను సమంత వెల్లడించారు.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అనాథ చిన్నారులకు ప్రాథమిక వైద్య పరీక్షలతోపాటు సేవలు, పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. సమంత ప్రత్యూష సంస్థ ఆదుకుంటున్న చిన్నారులు, పేద మహిళలకు తమవంతు సహకారం అందిస్తున్నట్లు నందకిషోర్ చెప్పారు.
తమవంతు కార్పొరేట్ బాధ్యతగా సంస్థ ద్వారా పేదలకు న్యూట్రిషన్, చర్మ, దంత వ్యాధుల వంటి విభిన్న రకాల వ్యాధులు, ఆరోగ్య పరిరక్షణకు సేవలను అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో కో-ఫౌండర్ డాక్టర్ ఏ మంజుల, లివ్ లైఫ్ సిఈఓ రత్న దుక్కపాటి, ప్రముఖ యువ డిజె పృథ్వీ తదితరులు ఉన్నారు.

సమంత
తనకు వీలు దొరికినప్పుడల్లా సామాజిక సేవ చేసేందుకు సమయం కేటాయిస్తానంటోంది ప్రముఖ దక్షిణాది నటి సమంత.

జ్యోతి ప్రజ్వలన
సమంత నిర్వహిస్తున్న సమంత ప్రత్యూష సపోర్ట్ స్వచ్ఛంద సేవా సంస్థతో.. సోమవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని లివ్ లైఫ్ ఆస్పత్రి చేతులు కలిపింది.

చిరునవ్వులు చిందిస్తూ..
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అనాథ చిన్నారులకు ప్రాథమిక వైద్య పరీక్షలతోపాటు సేవలు, పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు.

వివరాలు వెల్లడిస్తూ..
లివ్ లైఫ్ ఆస్పత్రి ఎండి నందకిషోర్ దుక్కపాటి, డాక్టర్ అనగాని మంజులతో కలిసి తమ సంస్థ చేపడుతున్న సేవల వివరాలను సమంత వెల్లడించారు.

కప్పుపై సంతకం
సమంత నిర్వహిస్తున్న సమంత ప్రత్యూష సపోర్ట్ స్వచ్ఛంద సేవా సంస్థతో.. సోమవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని లివ్ లైఫ్ ఆస్పత్రి చేతులు కలిపింది.


Click it and Unblock the Notifications