విజయానికి మూలాలు మరవొద్దు: అజీమ్ ప్రేమ్‌జీ

ఆదివారం హైదరాబాద్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) స్నాతకోత్సవంలో అజీమ్ మాట్లాడుతూ... విజయాన్ని సాధించాలన్న తపనతో ఉన్న చాలా మంది దానికి అవసరమైన ఈ మూడు కీలక అంశాలను నిర్లక్ష్యం చేస్తుంటారని.. ఈ మూడింటిపైనా దృష్టి పెడితేనే విజయం వరిస్తుందని అజీమ్ ప్రేమ్‌జీ అన్నారు. సాధారణ విషయాలుగా భావించే పట్టుదల, కఠోర శ్రమ, వినయం.. ఈ మూ డు అన్ని విజయాలకు కీలకంగా ఉంటాయన్నది మరువరాదని అన్నారు.
జీవితంలో విజయాలు అంత సులభంగా దరికి చేరవని తెలిపారు. వీటిని దక్కించుకోవాలంటే మాత్రం అంకితభావం, నిలకడత్వంతో ముందుకుసాగాల్సిన అవసరముందని అజీమ్ ప్రేమ్‌జీ వివరించారు. ‘కనీస సదుపాయాలు, రోజువారీ అవసరాలు లభించని వారు మన చుట్టూ ఎందరో ఉన్నారు. వీరికి చేతనైన సాయం చేయడాన్ని బాధ్యతగా కాక మనకు దక్కిన అవకాశంగా భావించాలి' అని విద్యార్థులకు ప్రేమ్‌జీ సూచించారు.
ఐఎస్‌బి ఛైర్మన్ ఆది గోద్రేజ్ మాట్లాడుతూ.. హైదరాబాద్, మొహాలీ క్యాంపస్‌లలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ, మెరుగైన మేనేజ్‌మెంట్ నిపుణులను ఐఎస్‌బి అందిస్తోందని తెలిపారు. ఐఎస్‌బి డీన్ అజిత్ రంగ్నేకర్ మాట్లాడుతూ... గత పన్నెండేళ్ల కాలంలో 6 వేల మందికి పైగా గ్రాడ్యుయేట్లు ఐఎస్‌బిలో పట్టాలను అందుకున్నారన్నారు. 2014లో మొత్తం 766 మంది విద్యార్ధులు మేనేజ్‌మెంట్ పిజి డిప్లొమాను పూర్తి చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్ క్యాంపస్‌లో 550, మొహాలీ క్యాంపస్‌లో 216 ఉన్నారని రంగ్నేకర్ తెలిపారు.


Click it and Unblock the Notifications