హైదరాబాద్: ప్రముఖ పాదరక్షల తయారీ కంపెనీ పారగాన్ ఆధునిక తరానికి చెందిన మహిళల కోసం సోలియా బ్రాండ్‌లో ఆకర్షణీయమైన ఆధునిక డిజైన్లతో పాదరక్షలు మార్కెట్‌లోకి తెచ్చింది. సోలియాకు సినీ నటి సమంతా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. శుక్రవారం హైదరాబాద్ కేంద్రంగా దక్షిణాది మార్కెట్‌లోకి సోలియాను ప్రవేశపెట్టిన సందర్భంగా సమంత ఈ పాదరక్షలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్) నవీన్ థామస్ మాట్లాడుతూ.. సోలియా బ్రాండ్‌కు సమంతను ప్రచారకర్తగా నియమిస్తున్నట్లు, ఈ ఒప్పందం మూడేళ్లు ఉంటుందని ప్రకటించారు.
అత్యంత ఆకర్షణీయమైన డిజైన్లతో సోలియాను రూపొందించామని చెప్పారు. ప్రస్తుతం 100 డిజైన్లతో సోలియా పాదరక్షలు అందుబాటులో ఉన్నాయని, వివిధ మార్కెట్లకు వేర్వేరుగా ఆరేసి కొత్త డిజైన్లు ప్రతీ నెలా విడుదల చేయాలనుకుంటున్నామని ఆయన తెలిపారు.
మొత్తం తమ పాదరక్షల అమ్మకాల్లో మహిళల పాదరక్షల వాటా 35 శాతం ఉండగా కొత్త పాదరక్షల ప్రవేశంతో అది 70 శాతానికి చేరుతుందని ఆయన తెలిపారు. ఈ కొత్త డిజైన్ పాదరక్షల ధర 129 రూపాయల నుంచి 349 రూపాయల మధ్య ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తాము ప్రస్తుతం 1,375 కోట్ల టర్నోవర్ సాధించామని, ఏడాదికి 25 శాతం వంతున వృద్ధిని సాధిస్తున్నామని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో తమకు ఐదు యూనిట్లున్నాయని, వెయ్యి మంది వరకు పని చేస్తున్నారని మరో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ మోనీ తెలిపారు. 2020 నాటికి ఐదు వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు. దేశంలో పాదరక్షల మార్కెట్ పరిమాణం 6 వేల నుంచి 7 వేల కోట్ల రూపాయల మధ్య ఉంటుందని ఆయన వివరించారు.

‘సోలియా'తో సమంత
ప్రముఖ పాదరక్షల తయారీ కంపెనీ పారగాన్ ఆధునిక తరానికి చెందిన మహిళల కోసం సోలియా బ్రాండ్‌లో ఆకర్షణీయమైన ఆధునిక డిజైన్లతో పాదరక్షలు మార్కెట్‌లోకి తెచ్చింది.

బ్రాండ్ అంబాసిడర్ సమంత
సోలియాకు సినీ నటి సమంతా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. సోలియా బ్రాండ్‌కు సమంతను ప్రచారకర్తగా నియమిస్తున్నట్లు, ఈ ఒప్పందం మూడేళ్లు ఉంటుందని పారగాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్) నవీన్ థామస్ ప్రకటించారు.

పారగాన్ ఈడి నవీన్ థామస్‌తో..
ప్రస్తుతం 100 డిజైన్లతో సోలియా పాదరక్షలు అందుబాటులో ఉన్నాయని, వివిధ మార్కెట్లకు వేర్వేరుగా ఆరేసి కొత్త డిజైన్లు ప్రతీ నెలా విడుదల చేయాలనుకుంటున్నామని నవీన్ థామస్ తెలిపారు.

సోలియానను ఆవిష్కరిస్తూ..
శుక్రవారం హైదరాబాద్ కేంద్రంగా దక్షిణాది మార్కెట్‌లోకి సోలియాను ప్రవేశపెట్టిన సందర్భంగా సమంత ఈ పాదరక్షలను ఆవిష్కరించారు.

ఆకర్షణీయమైన సోలియా డిజైన్స్..
ఆంధ్రప్రదేశ్‌లో తమకు ఐదు యూనిట్లున్నాయని, వెయ్యి మంది వరకు పని చేస్తున్నారని మరో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ మోనీ తెలిపారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications