ముంబై: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి బంగారం వ్యాపారంలోకి ప్రవేశించారు. ‘సత్యుగ్ గోల్డ్' పేరిట సొంతంగా ఒక ఆ భరణాల సంస్థను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ఛైర్‌పర్సన్ శిల్పాశెట్టి మాట్లాడుతూ.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సత్యుగ్ నగల దుకాణాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బంగారం గనులతో దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకున్నామని శిల్పాశెట్టి చెప్పారు. భారత్‌లో రెండు రిఫైనరీల లైసెన్సులు సొంతం చేసుకున్నామని ఆమె పేర్కొన్నారు.
మొదటి దశలో ముంబై, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, పుణె, చండీగఢ్, లూధియానాల్లో సత్యుగ్ నగల స్టోర్‌లు ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా 22 క్యారెట్ల బంగారు ఆభరణాలను, 24 క్యారెట్ల పసిడి నాణేలను ఆమె ఆవిష్కరించారు.

తాను డిజైన్ చేసిన రెగ్యులర్ కలెక్షన్ ఆభరణాలు ఇందులో విక్రయించనున్నట్టు శిల్పా చెప్పారు.
తాము మైన్ టు రిఫైనరీ సంస్థ ఏర్పాటు చేస్తున్నందు వల్ల బంగారం వ్యాపారంలో తమకు లభించే మార్జిన్లను వినియోగదారులకు డిస్కౌంట్ల రూపంలో అందించనున్నట్టు ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా ఇండియన్ బులియన్ అండ్ జ్యుయెల్లర్స్ అసోసియేషన్‌తో కుదిరిన ఐదేళ్ల ఒప్పందంలో భాగంగా అసోసియేషన్ అధ్యక్షుడు మోహిత్ కంబోజ్‌కు రాయల్టీ పేమెంట్‌గా రూ. 25 కోట్ల చెక్‌ను శిల్పాశెట్టి అందజేశారు.


Click it and Unblock the Notifications