హైదరాబాద్: బాలీవుడ్ షెహన్‌షా అమితాబ్ బచ్చన్ తన సతీమణి జయా బచ్చన్‌తో కలిసి హైదరాబాదులో సోమవారం సందడి చేశారు. బ్రిటిష్ ఎయిర్‌వేస్ సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లండన్ నగరమంటే తనకు చాలా ఇష్టమని, తమ కుటుంబానికి ఆ నగరంతో అవినాభావ సంబంధం ఉందని అమితాబ్ చెప్పారు. తమ కుటుంబ సభ్యులు ఎక్కువగా బ్రిటిష్ విమానయాన సంస్థ విమానాల్లోనే ప్రయాణిస్తారని ఆయన చెప్పారు.
హైదారబాదులోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సోమవారం రాత్రి బ్రిటిష్ ఎయిర్‌వేస్ భారత్‌లో సర్వీసులను ప్రారంభించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నమస్కారం, మీకందరికీ కొత్త సంవత్సరం సందర్భంగా ఉగాది పండుగ శుభాకాంక్షలు అని తెలుగులో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
లండన్ నగరంతో తనకున్న అనుబంధాన్ని అమితాబ్ వివరించారు. తన తండ్రి లండన్‌లో ఉన్నత విద్య అభ్యసించారని, తన భార్య బంధువులు అక్కడే చదువుకున్నారని ఆయన అన్నారు. కేంబ్రిడ్జీ విశ్వవిద్యాలయంతో తన కుటుంబ సభ్యులకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు.
తన శ్రీమతితో కలిసి తాను లండన్‌కే హానీమూన్‌కు వెళ్లానని ఆయన చెప్పారు. ఘన చరిత్ర గల హైదరాబాద్ అంటే తనకెంతో అభిమానమని అమితాబ్ చెప్పారు. తాను హైదరాబాదులో విస్తృతంగా తిరిగినట్లు తెలిపారు. పాతబస్తీ తనను ఎంతో ఆకట్టుకుందని అమితాబ్ అన్నారు.
బ్రిటిష్ విమానయాన సంస్థ దక్షిణాసియా ప్రాంతీయ వాణిజ్య మేనేజర్ క్రిస్టోఫర్ ఫోర్డిస్ కూడా మాట్లాడారు. భారత్‌లో తొలిసారిగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ దేశాలకు బోయింగ్ 787 సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. లండన్ బేస్ కేంద్రంగా పనిచేస్ తమ సంస్థను 85 ఏళ్ల క్రితం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం 75 దేశాల్లోని 160 నగరాల్లో తాము సేవలను అందిస్తున్నట్లు తెలిపారు

హైదరాబాద్‌లో అమితాబ్
బ్రిటిష్ విమానయాన సంస్థ తన సర్వీసులను ప్రారంభించిన కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ బచ్చన్, ఆయన సతీమణి జయా బచ్చన్ ఇలా..

హైదరాబాద్‌లో అమితాబ్
హైదరాబాద్ అంటే తనకెంతో అభిమానమని అమితాబ్ బచ్చన్ చెప్పుకున్నారు. తాను హైదరాబాదులో చాలా వరకు పర్యటించానని ఆయన చెప్పారు.

హైదరాబాద్‌లో అమితాబ్
తన కుటుంబ సభ్యులు ఎక్కువగా బ్రిటిష్ విమానయాన సర్వీసుల్లోనే ప్రయాణాలు చేస్తారని అమితాబ్ చెప్పారు.

హైదరాబాద్‌లో అమితాబ్
లండన్ నగరమంటే తనకు ఎంతో ఇష్టమని, తన కుటుంబ సభ్యులకు లండన్ నగరంతో అవినాభావ సంబంధం ఉందని చెప్పారు

హానీమూన్ లండన్‌లోనే..
తాను తన భార్య జయాబచ్చన్‌తో కలిసి హానీమూన్‌కు లండన్ నగరమే వెళ్లినట్లు అమితాబ్ బచ్చన్ చెప్పారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications