రూ. లక్ష: సుబ్రతా విడుదలకు ఉద్యోగుల సాయం

ఈ మేరకు సహారియయ్‌న్ ఇ-మల్టీపర్పస్ సొసైటి లిమిటెడ్ డైరెక్టర్లు, గ్రూప్ అసోసియేట్ల సంతకాలతో ఓ లేఖ విజ్ఞప్తి చేసింది. 11 లక్షల ఉద్యోగులు, ఫీల్డ్ వర్కర్లున్న ఈ సొసైటీలో ఇందుకు బదులుగా షేర్ల కేటాయింపు ఉంటుందని కూడా డైరెక్టర్లు ఒక పేజీ కలిగిన ఈ లేఖలో ప్రతిపాదించారు. సహారా ఇండియా పరివార్, దాని శ్రేయోభిలాషులు రూ. లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఇలా వారి స్థాయి, స్తోమతకు తగ్గట్లుగా ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
మరోవైపు ఈ ప్రతిపాదన సుబ్రతారాయ్ గానీ, యాజమాన్యం గానీ జారీ చేయలేదని సహారా గ్రూప్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఇది ప్రస్తుత పరిస్థితిని చూసి కలత చెందుతున్నవారి అభ్యర్థనేనని పేర్కొన్నారు. కాబట్టి ఇది సహారా గ్రూప్ లేదా మేనేజ్‌మెంట్ చర్యగా పరిగణించరాదన్నారు. ‘సహారశ్రీ (సుబ్రతారాయ్‌ని సహారా గ్రూప్ పిలిచే పేరు) ఈ సంస్థ (సహారా)ను ఓ కుటుంబంలా భావించి ఈ స్థాయిలో నిర్మించారు. కాబట్టి కుటుంబ పెద్ద ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిని తట్టుకోలేక చాలామంది స్పందిస్తున్నారు. దేశవ్యాప్తంగా లేఖలు వస్తున్నాయి. దీన్ని అర్థం చేసుకోగలరని భావిస్తున్నాం.' అని ఆయన తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా సహారా గ్రూప్‌లోని రెండు సంస్థలు మదుపర్ల నుంచి వేల కోట్ల రూపాయల నిధులను సరించాయంటూ సెబీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ డబ్బును వెంటనే మదుపర్లకు చెల్లించాలన్న సెబీ ఆదేశాన్ని సహారా ఎదురించడంతో ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది.
ఈ కేసు విచారణలోనే కోర్టు హాజరు కావాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాన్ని సుబ్రతారాయ్ పట్టించుకోకపోవడంతో ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. మార్చి 4 నుంచి తీహార్ జైలులోనే సుబ్రతారాయ్‌ను తాత్కాలిక బెయిల్‌పై విడుదల చేసేందుకు 5,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీతో కలిపి 10,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు ఈ మధ్యనే ఆదేశాలు జారీ చేసింది.


Click it and Unblock the Notifications