హైదరాబాద్ : చిన్నారులకు నోరూరించే పళ్ళరసాలు అందించడంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన స్విట్జర్లాండ్‌కు చెందిన కాప్రిసన్ ఎజి సంస్థ భారత మార్కెట్‌లో ప్రవేశించింది. రాష్ట్రంలోని హైదరాబాద్‌కు చెందిన ఎస్‌డియు బెవరేజెస్ భాగస్వామ్యంలో నాలుగు రకాల ఫ్లేవర్లలో జ్యూస్‌లను బుధవారం నగరంలో విడుదల చేసింది. ఈ సందర్భంగా కాప్రిసన్ సిఈఓ కార్‌స్టక్ కైసిగ్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా పళ్లరసాలను అందిస్తూ భారతదేశంలో కూడా ప్రవేశించడం తమకు ఆనందంగా ఉందని తెలిపారు. తమ పళ్ల రసాల రుచులతో పిల్లల్లో ఆరోగ్యంతోపాటు ఆనందం నింపుతామని తెలిపారు.
ఎస్‌డియు బెవరేజెస్ ఎండి కిషోర్ అగర్వాల్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌తో సహా దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో తొలి దశలో తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంటాయని, అనంతర దశలో అన్ని నగరాలు, పట్టణాలకు వీటిని విస్తరిస్తామని తెలిపారు. 200 ఎంఎల్ ప్యాక్ ధరను 20 రూపాయలుగా నిర్ణయించామని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి అవి మ్యాంగో, ఆరెంజ్, యాపిల్, మిక్స్‌డ్ ఫ్రూట్ ఫ్లేవర్లలో అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. కాప్రిసన్ ఉత్పత్తులు ఆరోగ్యానికి హాని కలిగించే ఎలాంటి కృత్రిమ పదార్థాలు లేని పళ్ళరసాలని ఆయన చెప్పారు.
కాప్రిసన్ ఉత్పత్తుల తయారీకి తాము 50 కోట్ల పెట్టుబడితో పఠాన్‌చెరు సమీపంలో అత్యాధునిక ఫ్యాక్టరీ నెలకొల్పామని, ఆ ఫ్యాక్టరీ నుంచే దేశం మొత్తానికి వాటిని పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఈ ఫ్యాక్టరీ ఏడాదికి ఒక్కోటి 40 ప్యాక్‌లున్న 20 లక్షల కేస్‌లను ఉత్పత్తి చేయగలదని, అవసరాన్ని బట్టి ఉత్పత్తిని మూడింతలు చేయగల వసతులు ఇందులో ఉన్నాయని ఆయన చెప్పారు. నాణ్యతా ప్రమాణాల కోసం కాప్రిసన్ జ్యూస్‌ల తయారీకి అవసరం అయిన ఫ్లేవర్లను, పౌచ్‌లను, యంత్రపరికరాలను జర్మనీ నుంచి సరఫరా చేస్తున్నట్టు కంపెనీ వైస్‌ప్రెసిడెంట్ అంతర్జాతీయ సేల్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ పీటర్ బాక్ తెలిపారు.
భారత మార్కెట్‌లో ప్రవేశం ఒక సవాలేనని, అయినా నాణ్యతే గీటురాయిగా తాము ఈ పళ్ళరసాలను ప్రవేశపెట్టామని కాప్రిసన్ మిడిల్ ఈస్ట్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రూయ్ మార్టిన్స్ చెప్పారు.
భారత జనాభాలో మూడో వంతు మంది 15 సంవత్సరాల లోపు వారే కావడం మార్కెట్ విస్తరణకు మంచి అవకాశంగా భావించినట్టు ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా జ్యూస్ మార్కెట్ పరిమాణం 70 కోట్ల లీటర్లని, ఇది ఏటా 15 శాతం వృద్ధిని సాధిస్తున్నదని ఆయన చెప్పారు.

పళ్ల రసాల రుచి చూస్తూ..
చిన్నారులకు నోరూరించే పళ్ళరసాలు అందించడంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన స్విట్జర్లాండ్‌కు చెందిన కాప్రిసన్ ఎజి సంస్థ భారత మార్కెట్‌లో ప్రవేశించింది.

పళ్లరసాల పరిచయం
రాష్ట్రంలోని హైదరాబాద్‌కు చెందిన ఎస్‌డియు బెవరేజెస్ భాగస్వామ్యంలో కాప్రిసన్ నాలుగు రకాల ఫ్లేవర్లలో జ్యూస్‌లను బుధవారం నగరంలో విడుదల చేసింది.

ఆనందంతోపాటు ఆరోగ్యం
ఈ సందర్భంగా కాప్రిసన్ సిఈఓ కార్‌స్టక్ కైసిగ్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా పళ్లరసాలను అందిస్తూ భారతదేశంలో కూడా ప్రవేశించడం తమకు ఆనందంగా ఉందని తెలిపారు. తమ పళ్ల రసాల రుచులతో పిల్లల్లో ఆరోగ్యంతోపాటు ఆనందం నింపుతామని తెలిపారు.

తొమ్మిది నగరాల్లో..
ఎస్‌డియు బెవరేజెస్ ఎండి కిషోర్ అగర్వాల్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌తో సహా దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో తొలి దశలో తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంటాయని, అనంతర దశలో అన్ని నగరాలు, పట్టణాలకు వీటిని విస్తరిస్తామని తెలిపారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications