
2010లో 230 కోట్ల డాలర్లుగా ఉన్న టిసిఎస్ బ్రాండ్ విలువ 2014 నాటికి ఏకంగా నాలుగింతలు పెరిగిందని పేర్కొంది. 2013లో కంపెనీ బ్రాండ్ విలువ 520 కోట్ల డాలర్లుగా ఉంది. అంతేకాకుండా టిసిఎస్ బ్రాండ్‌కు ఎఎ ప్లస్ రేటింగ్‌ను బ్రాండ్ ఫైనాన్స్ ప్రకటించింది. కాగా 2014లో ఐబిఎం బ్రాండ్ విలువ పది శాతం వృద్ధి చెంది 4,150 డాలర్లకు, హెచ్‌పి బ్రాండ్ విలువ 23 శాతం పెరిగి 1,980 కోట్ల డాలర్లకు చేరుకుంది. 2013లో డిజిటల్ సర్వీసులకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగిపోవటంతో టిసిఎస్ వ్యాపారం అత్యంత వేగంగా వృద్ధి చెందటంతో కంపెనీకి అగ్రస్థానం లభించిందని సంస్థ సిఇఒ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు.
మార్కెట్లకు ఎఫ్ఐఐ వెల్లువ
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఉదయం ప్రారంభం నుంచే దూకుడు మీదున్న సూచీలు ముగింపు సమయానికి నూతన ఆల్‌టైమ్ హై వద్ద స్థిరపడ్డాయి. మదుపర్ల ఉత్సాహంతో 300.16 పాయింట్లు బలపడిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 22,055.48 పాయింట్ల వద్ద నిలిచింది. దీంతో మార్చి 10న నమోదైన ఆల్‌టైమ్ హై 21,934.83 స్థాయి కనుమరుగైంది.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 88.60 పాయింట్లు పుంజుకుని 6,583.50 స్థాయికి చేరి మరో కొత్త ఆల్‌టైమ్ హై ముగింపునకు తెరతీసింది. ఇక ఇంట్రా-డే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 22,074.34 స్థాయిని తాకి ఇంతకుముందు మార్చి 18న నమోదైన 22,040.72 స్థాయిని చెరిపేసింది. నిఫ్టీ కూడా 6,591.50 స్థాయిని అందుకుంది. సోమవారం మొత్తంగా 155 షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. బ్యాంకింగ్, రిఫైనరీ, మెటల్, ఆటో, పవర్, క్యాపిటల్ గూడ్స్ షేర్లకు మదుపర్ల నుంచి మంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. 2.73 శాతం నుంచి 0.83 శాతం మేర లాభాలను అందుకున్నాయ.
ముఖ్యంగా రాబోయే సాధారణ ఎన్నికల్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని, ఏప్రిల్ 1న జరిపే ద్రవ్య సమీక్షలో రిజర్వ్ బ్యాంకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటుందన్న అంచనాలతో విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ) బ్యాంకింగ్ రంగ షేర్లపై అమితాసక్తిని ప్రదర్శించారు. అయితే ఔషధ, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఐటి రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నమోదైంది. గురువారంతో ముగుస్తున్న మార్చి డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు సైతం దేశీయ మార్కెట్లకు కలిసోచ్చిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
దేశీయ స్టాక్‌మార్కెట్లు కొత్త రికార్డులను అందుకోవడంలో విదేశీ సంస్థాగత మదుపర్ల పాత్ర కీలకమైనదని, మార్చి 20 వరకు వారు 17,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చారని వెరాసిటి బ్రోకింగ్ సర్వీసెస్ రిసెర్చ్ అధిపతి జిగ్నేశ్ చౌధరి అన్నారు. కాగా, గెయిల్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హెచ్‌డిఎఫ్‌సి, ఒఎన్‌జిసి, టిసిఎస్, హెచ్‌యుఎల్, ఎల్‌అండ్‌టి, ఐటిసి షేర్లు 4.81 శాతం నుంచి 1.11 శాతం మధ్య లాభాలను పొందాయి.
More From GoodReturns

పుంజుకున్న భారత స్టాక్ మార్కెట్.. ఊపిరి పీల్చుకున్న ఇన్వెస్టర్లు.. అయినా గుండెల్లో దడే..

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

TCS Q4 FY26 Results: టీసీఎస్ క్యూ4 ఎఫ్వై26 ఫలితాలు ఇవిగో.. భారీగా పెరిగిన లాభాలు..డివిడెండ్ ఎంతంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications