హైదరాబాద్‌లో తొలి మహిళా బ్యాంకు ప్రారంభం

ఈ సందర్భంగా శాంతా సిన్హా మాట్లాడుతూ.. భారతీయ మహిళా బ్యాంకును ప్రారంభించే అవకాశం తనకు కల్పించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ బ్యాంకు సాధారణ మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు, వారికి బ్యాంకుల సేవలను సమర్థవంతంగా అందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. దేశంలో ఇంతవరకు 18 శాఖలు ఏర్పాటు చేయగా, 19వ శాఖను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడాన్ని ఆమె స్వాగతించారు.
రాష్ట వ్యాప్తంగా బ్రాంచి కార్యకలాపాలు విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. బ్యాంకు సిఎండి ఉషా సుబ్రహ్మణియన్ మాట్లాడుతూ.. మహిళలకు సంపూర్ణమైన బ్యాంకు, ఆర్థిక సేవలను అందిస్తామని తెలిపారు. మహిళల సామాజిక జీవితంలో సానుకూల మార్పులు, సాధికారత కల్పించేందుకు ఈ బ్యాంకు ఉపయోగపడుతుందని చెప్పారు.
రూ. కోటి వరకు డిపాజిట్లపై 9.15 శాతం వడ్డీ ఇస్తున్నామని వివరించారు. మహిళలకు రుణాలు అందించే స్కీంలు ఉన్నాయని, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదర్చుకున్నామని, బీమా ఉత్పత్తులను విక్రయిస్తామన్నారు. టాటా మోటార్స్ కూడా ఎంఓయు కుదుర్చుకుందని తెలిపారు. అక్షరాస్యత, నైపుణ్యత, మహిళలకు ఉపాధి అవకాశాల పెంపు కార్యక్రమాలపై దృష్టిపెడుతున్నట్లు ఉషా సుబ్రహ్మణియన్ వివరించారు.


Click it and Unblock the Notifications