న్యూఢిల్లీ/హైదరాబాద్: బంగారం దిగుమతులపై విధించిన ఆంక్షలను సమీక్షించాలన్న డిమాండ్‌కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ పరోక్షంగా మద్దతు పలికారు. బంగారం దిగుమతులపై ఉన్న ఆంక్షలు స్మగ్లింగ్‌కు దారితీస్తున్నాయని ఆయన పిటిఐకి తెలిపారు. ఈ నేపథ్యంలో నిబంధనలను సమీక్షిస్తే బాగుంటుందని తాను భావిస్తున్నానని ఆనంద్ చెప్పారు. కరెంట్ ఖాతా లోటు (క్యాడ్)ను కట్టడి చేయడానికి ప్రభుత్వం బంగారం దిగుమతులపై సుంకాన్ని పెంచిన విషయం తెలిసిందే.
దిగుమతి చేసుకున్న బంగారంలో కొంత భాగాన్ని ఎగుమతి చేయాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు విధించింది. ఫలితంగా బంగారం దిగుమతులు తగ్గడం మొదలైంది. దీని వల్ల దేశీయ మార్కెట్లో పసిడి కొరత ఏర్పడుతోందని, దీనిని నివారించేందుకు ఆంక్షలు సడలించాలని బంగారం వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అటు వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా ఇటు క్యాడ్ పెరగకుండా ఉండేలా సమతౌల్య విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శర్మ అభిప్రాయపడ్డారు.

దేశ మొత్తం ఎగుమతుల్లో వజ్రాలు, ఆభరణాల ఎగుమతుల వాటా 15 శాతం వరకు ఉంది. ఫిబ్రవరి నెలలో ఈ రంగం ఎగుమతులు 4.18 శాతం క్షీణించి 359 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలలకాలంలో ఎగుమతులు 7.15 శాతం మేర తగ్గి 3,573 కోట్ల డాలర్లకు చేరాయి. ఫిబ్రవరిలో బంగారం, వెండి దిగుమతులు 71.4 శాతం క్షీణించి 163 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.
విశాఖలో ఏపిఐ ప్లాంట్
హైదరాబాద్: కాంట్రాక్టు రీసెర్చ్, ఉత్పత్తుల రంగంలో ఉన్న జివికె బయోసైన్సెస్ ప్రస్తుత, కొత్త కస్టమర్ల అవసరాల దృష్టిలో ఉంచుకొని 100 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో యాక్టివ్ ఫార్మాస్యుటికల్ ఇన్‌గ్రిడియెంట్స్ (ఎపిఐ) ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. శుక్రవారంనాడు సంస్థ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన మీడియాంతో.. జివికె బయోసైన్సెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మన్ని కంటిపూడి మాట్లాడారు.
విశాఖపట్నంలోని ఫార్మా సెజ్‌లో కొత్త ఎపిఐ ప్లాంట్ నెలకొల్పే యోచన ఉందని అయితే దీన్ని ఇంకా ఖరారు చేయలేదని చెప్పారు. జూన్ తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఎపిఐ ప్లాంట్ కోసం విశాఖపట్నంతో పాటు మరో రెండు ప్రాంతాలు కూడా పరిశీలనలో ఉన్నట్టు చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications