న్యూయార్క్/బెంగళూరు: ప్రపంచంలోనే ప్రముఖ ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ సిఈఓగా అవుతానని తను కలలో కూడా అనుకోలేదని సత్య నాదెళ్ల తెలిపారు. మైక్రోసాఫ్ట్ విండోస్ అజూర్ క్లౌడ్ కాన్ఫరెన్స్, 2014లో ఆయన మాట్లాడుతూ..‘భారతదేశంలో పుట్టిన నేను ఈ విధంగా మైక్రోసాఫ్ట్ సిఈఓ హోదాలో మీతో మాట్లాడుతానని కలలో కూడు భావించలేదు'ని పేర్కొన్నారు. గత ఫిబ్రవరిలో స్టీవ్ బామర్ స్థానంలో తెలుగువాడైన సత్య నాదెళ్ల బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా వీడియో ప్రసారం ద్వారా పలు డెవలపర్లు, ఐటి వృత్తినిఫుణులతో ఆయన మాట్లాడారు. అజూర్ క్లౌడ్‌తో భారత్‌లో విస్తృత అవకాశాలు వస్తాయన్నదే తన విశ్వాసమని తెలిపారు. వాటన్నంటినీ మీరు ఒడిసిపట్టుకోవాలనే కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ నిర్వహిస్తున్న డేటా కేంద్రాల గ్లోబల్ నెట్‌వర్క్‌తో డెవలపర్లు తమ అప్లికేషన్లను విండోస్ అజూర్ ప్లాట్ పాం ద్వారా ఎంతో త్వరితగతిన నిర్వహించుకోవచ్చని తెలిపారు.
భారతదేశంలోని ఐటి వృత్తినిపుణులు, డెవలపర్లు, స్టార్టవ్ కంపెనీలు తమ అప్లికేషన్లను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు అందించవచ్చని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. తద్వారా వ్యయాలను తగ్గించుకోవచ్చని ఆయన సూచించారు. వ్యాపారాలను మరింత విస్తృత పర్చడానికి తమ భాగస్వాములకు ఇదొక మంచి అవకాశమని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. అజూర్ మార్కెట్లు భారత్‌లో వేగంగా వృద్ది చెందుతున్నాయని చెప్పారు. భారతదేశంలో మైక్రోసాఫ్ట్‌కు 10వేల మంది భాగస్వాములు, 1.6 మిలియన్ల డెవలపర్లు ఉన్నట్లు ఆయన చెప్పారు.

గొప్ప నాయకుల్లో మహీంద్రా, మిట్టల్
ప్రపంచంలోని 50 మంది గొప్ప నాయకులతో రూపొందించిన జాబితాలో భారత వ్యాపార దిగ్గజాలైన ఆనంద్ మహీంద్రా, లక్ష్మీ మిట్టల్‌కు చోటు లభించింది. ఫార్చూన్ మేగజైన్ గురువారం విడుదల చేసిన ఈ జాబితాలో మొదటి స్థానంలో 77 ఏళ్ల పోప్ నిలిచారు. ఈ జాబితాలో నోబుల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్ సూకీ, దలైలామా, పోప్ ఫ్రాన్సిస్‌లు కూడా చోటు దక్కించుకున్నారు. తమ అనుచరుల శక్తిసామర్థ్యాలు పెంచడమేకాకుండా ప్రపంచాన్ని ఉత్తమంగా తీర్చి దిద్దడానికి ఈ నాయకులు దోహదపడినట్టు ఫార్చూన్ కీర్తించింది.
గొప్ప నాయకుల జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా 40వ స్థానంలో నిలువగా... ఆర్సెలార్ మిట్టల్ సిఈఓ లక్ష్మీ మిట్టల్ 48 స్థానంలో ఉన్నారు. వినూత్న వ్యాపార దృక్పథం కలిగిన ఆనంద్ మహీంద్రా.. ఆటో, కంప్యూటర్ సర్వీసెస్, ఏరోనాటిక్స్ తదితర రంగాల్లో కంపెనీలను హస్తగతం చేసుకుని గ్రూప్ విస్తరణకు దోహదపడ్డారని పేర్కొంది. ఉక్కు రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో తన దైన శైలీలో నిర్ణయాలు తీసుకుంటూ లక్ష్మీ మిట్టల్ వ్యాపారంలో దూసుకుపోయారని.. అటు ప్రభుత్వం ఇటు శక్తివంతమైన కార్మిక యూనియన్లను మెప్పించారని ప్రశంసించింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications