నాదెళ్లకు గౌరవ డాక్టరేట్: సామ్‌సంగ్‌కు నోటీసులు

న్యూయార్క్/న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల, నోకియా సిఈఓ రేసులో ఉన్న రాజీవ్ సూరిలకు మనదేశానికి చెందిన మణిపాల్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌లను ప్రకటించింది. త్వరలోనే వీరిని గౌరవ డాక్టరేట్‌లతో సత్కరించనున్నట్లు మణిపాల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ రామ్‌దాస్ పేర్కొన్నారు.

సత్య నాదెళ్ల మా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కావడం తమకు గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు. రాజీవ్ సూరి కూడా ఇప్పుడు మొబైల్ ఫోన్ దిగ్గజం నోకియా సిఈఓ రేసులో ఉన్నాడని, అతను కూడా తమ యూనివర్సిటీలో విద్యనభ్యసించారని తెలిపారు. వీరిద్దరి తమ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడం పట్ల తమకు ఎంతో సంతోషంగా ఉందని రామదాస్ తెలిపారు.

సామ్‌సంగ్‌కు పన్ను ఎగవేత నోటీసులు

ఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ సామ్‌సంగ్‌కు డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) మంగళవారం నోటీసులు జారీ చేసింది. సామ్‌సంగ్ 70 కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడిందని ఈ నోటీసుల్లో డిఆర్‌ఐ పేర్కొంది. 2012 ఏప్రిల్ నుంచి 2013 ఫిబ్రవరి మధ్య దక్షిణ కొరియా నుంచి 460 కోట్ల రూపాయల విలువైన టాబ్లెట్లను దిగుమతి చేసుకుని దానికి సంబంధించిన పన్నును చెల్లించలేదని వివరించింది.

satya nadella

కాగా, డిఆర్‌ఐ ఈ నోటీసులను సామ్‌సంగ్ ఇండియాకు జనవరిలో జారీ చేసింది. దీనిపై సంస్థ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. తాము వ్యాపారం చేస్తున్న అన్ని దేశాల్లో అక్కడి చట్టాలను, రెగ్యులేటరీ వ్యవస్థలకు లోబడి పని చేస్తామని తెలిపారు. అయినప్పటీ ఈ నోటీసుపై సమీక్షిస్తున్నామని చెప్పారు. ఇదిలావుంటే విదేశాల నుంచి భారత్‌లోకి దిగుమతి అయ్యే టాబ్లెట్లపై 12 శాతం, మొబైల్ ఫోన్లపై 1 శాతం సుంకాన్ని ప్రభుత్వం విధిస్తోంది.

నార్త్‌గేట్ అరిన్సో టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్

హైదరాబాద్: బ్రిటన్‌కు చెందిన నార్త్‌గేట్ అరిన్సో హ్యూమన్ రీసోర్సెస్ కంపెనీ తమ హైదరాబాద్ సెంటర్ సామర్థ్యాన్ని విస్తరించే పనిలో పడింది. ఇందు కోసం 58 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. దీనికి తోడు ఇక నుంచి హైదరాబాద్ సెంటర్‌పై ప్రతీ ఏడాది ఐదు కోట్ల రూపాయల వంతున కొత్తగా ఇన్వెస్ట్ చేయాలని కూడా నిర్ణయించింది.

కంపెనీ సిఈఓ అదెల్ అల్ సలే మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం హైదరాబాద్ కాకుండా కొచ్చిలో కూడా తమ సెంటర్ ఒకటి పని చేస్తున్నదని చెప్పారు. నానాటికీ విస్తరిస్తున్న కస్టమర్ బేస్‌ను దృష్టిలో ఉంచుకుని కొచ్చి సెంటర్‌ను కూడా మరో 50 కోట్ల రూపాయల పెట్టుబడితో విస్తరించనున్నట్టు తెలియచేశారు. బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్, పేరోల్ సర్వీసులు అందించే తమ కంపెనీ రానున్న కాలంలో హైదరాబాద్‌ని తమ టెక్నాలజీ హబ్‌గా మార్చుకోవాలనుకుంటున్నదని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) మైకేల్ కస్టర్స్ చెప్పారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+