
ఈ మేరకు ఫిన్లాండ్ మీడియా వివరాల ద్వారా తెలుస్తోంది. నోకియా మొబైల్ ఫోన్ల వ్యాపారం మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నోకియా వ్యాపారం కూడా ఇదే సమయానికి మైక్రోసాఫ్ట్ అధీనంలోకి రానుంది. కాగా, భారతదేశంలోని మంగళూరు యూనివర్సిటీలోనే చదువుకున్న సత్య నాదెళ్ల అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సిఇఒగా ఫిబ్రవరిలో నియమితులవగా, ఇప్పుడు అదే యునివర్సిటీలో ఇంజినీరింగ్ చేసిన రాజీవ్ సూరి నోకియా సిఈఓ అవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అంతేగాక అంతర్జాతీయ కంపెనీలకు సిఈఓలుగా ఉన్న భారతీయుల జాబితాలో సూరి సైతం స్థానం సంపాదించుకోనున్నారు. ఇప్పటికే పెప్సీకో చైర్‌పర్సన్‌గా ఇంద్రా నూరుూ, డ్యూషే బ్యాంక్ సిఇఒగా అన్షూ జైన్, రెకిట్ బెన్‌కిజర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాకేష్ కపూర్, మాస్టర్‌కార్డ్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ బంగా తదితరులున్నారు. 1967లో జన్మించిన రాజీవ్ సూరి.. 2009 నుంచి నోకియా సొల్యూషన్స్, నెట్‌వర్క్స్ అధిపతిగా పనిచేస్తున్నారు. కంపెనీ లాభాలు పెంచడానికి, పునర్‌వ్యవస్థీకరణకు ఈయన తీసుకున్న నిర్ణయాలు బాగా కలిపి వచ్చినట్టు చెబుతున్నారు.
అంతర్జాతీయంగా స్ట్రాటజీ, విలీనాలు, కొనుగోళ్లు, ప్రాడక్ట్ మార్కెటింగ్, సేల్స్, మేజర్ అకౌంట్ లీడర్‌షిప్, రీజినల్ అండ్ బిజినెస్ యూనిట్ లీడర్‌షిప్ వంటి విభాగాల్లో సూరి 23 ఏళ్ల అనుభవాన్ని సంపాదించారు రాజీవ్ సూరి. మధ్యప్రాచ్యం, ఆసియా, ఆఫ్రికా, యూరప్‌వంటి రీజియన్లలో పని చేశారు. 1995లో నోకియాలో చేరిన సూరి 2007 సంవత్సరంలో నోకియా ఎన్ఎస్ఎన్ ఆసియా పసిఫిక్ రీజియన్‌ను హెడ్‌గా పని చేశారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications