
మా టీవిని విక్రయించేందుకు ఇతర యజమానులైన కేంద్రమంత్రి చిరంజీవి, సినీ హీరో నాగార్జున, సినీ నిర్మాత అల్లు అరవింద్ కూడా అంగీకారం తెలిపినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకూ నిమ్మగడ్డ ప్రసాద్‌కు సంబంధించిన మీడియా ప్రతినిధులు ఎవరూ ప్రకటించలేదు. ప్రస్తుతం తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానళ్ల వ్యాపారం బాగా జరుగుతోంది. వ్యాపారం విలువ సుమారు రూ. 1800 కోట్లుగా ఉంది.
మా టీవిని విక్రయించేందుకు సోనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంతేగాక కేర్ హాస్పిటల్స్, ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలలో ఉన్న యాజమాన్య హక్కులను కూడా వదులుకునేందుకు నిమ్మగడ్డ ప్రసాద్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మ్యాట్రిక్స్ లాబోరేటరీస్‌ను మిలాన్ కంపెనీకి రూ. 550 కోట్లకు నిమ్మగడ్డ ప్రసాద్ విక్రయించారు.
కాగా, వైయస్ జగన్మోహన్ రెడ్డితోపాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు పారిశ్రామిక వేత్తలు, నాయకులు రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణతోపాటు రాంకీ గ్రూప్ ఛైర్మన్ అయోధ్య రామిరెడ్డి, కోనేరు ప్రసాద్‌లు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు.


Click it and Unblock the Notifications