
చిరంజీవి చొరవతో ఎన్నో రోజులుగా చెబుతున్న పాకశాస్త్ర విశ్వవిద్యాలయానికి కేంద్ర కేబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. ఈ వర్సిటీని తిరుపతిలో ఏర్పాటు చేయడానికి కూడా ఆమోదం తెలిపింది. ఈ విశ్వవిద్యాలయంలో ప్రపంచ స్థాయిలో వివిధ వంటకాల గురించి శాస్త్రీయ బోధన లభిస్తుంది. కోల్‌కతా, ఢిల్లీతోపాటు దేశంలోని వివిధ నగరాల్లో వర్సిటీ శాఖలుంటాయి.
ఆతిథ్య రంగంలో దేశం చెప్పుకోదగిన అభివృద్ధి సాధించిన రీత్యా దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వర్సిటీ సిలబస్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటుందని అధికార వర్గాలు చెప్పాయి. ఇంకా వర్సిటీలో మాస్టర్స్ కోర్సులను, ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ అందించనున్నారు. కాగా చిరంజీవి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి భారతీయ పాక శాస్త్ర యూనివర్సిటీ ఏర్పాటు కోసం కృషి చేశారు.
12వ పంచవర్ష ప్రణాళికలో పర్యాటకరంగ వర్కింగ్ గ్రూప్ నివేదికలో ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ (పాకశాస్త్ర యూనివర్సిటీ)ను ఒక ప్రత్యేక ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పాటు చేయాలని చిరంజీవి సూచించారు. కాగా, ఇప్పటికే తిరుపతిలో వర్సిటీ కోసం 14 ఎకరాల భూమిని పర్యాటక శాఖ కేటాయించింది. మరో 20 నెలల్లో తిరుపతిలో ఈ వర్సిటీ పనులు పూర్తి కానున్నాయి. 2016 విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications