హైదరాబాద్: దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాలతోపాటు తృతీయ శ్రేణి నగరాల్లోనూ విమానాశ్రయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనను రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహంతో కలిసి ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. ఈ ఏవియేషన్ షోలో పలు దేశాలకు చెందిన విమానాలు సందడి చేశాయి.
ప్రభుత్వం 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో మారుమూల ప్రాంతాల కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని అజిత్ సింగ్ చెప్పారు. ఇందులో ప్రైవేటు రంగం పెద్ద ఎత్తున భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. విమానాశ్రయాల అభివృద్ధికి 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రభుత్వం 1,210 కోట్ల డాలర్లు (75 వేల కోట్ల రూపాయలు) కేటాయించిందని, ఇందులో ప్రైవేటు రంగం వాటాగా 930 కోట్ల డాలర్లు (58 కోట్ల రూపాయలు) ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం విమానయాన రంగంలో ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో ఉన్న ఇండియా 2020 నాటికి మూడో స్థానానికి చేరే అవకాశం ఉందని అజిత్ సింగ్ చెప్పారు. ప్రస్తుతం ఏడాదికి 1.21 కోట్ల మంది ప్రయాణికులను దేశీయ గమ్యాలకు, 41 లక్షల మంది ప్రయాణికులను అంతర్జాతీయ గమ్యాలకు చేరుస్తున్న భారత విమానయాన రంగం 2020 నాటికి 3.36 కోట్ల మందిని దేశీయంగాను, 85 లక్షల మందిని అంతర్జాతీయ గమ్యాలకు చేర్చగల స్థాయికి పెరుగుతుందని అంచనాగా ఆయన తెలిపారు.
ఈ వృద్ధికి దీటుగా కొత్త విమానాశ్రయాల నిర్మాణం చేపట్టడంతో పాటు ప్రస్తుత విమానాశ్రయాలను విస్తరించడం, ఆధునికీకరించడం అవసరమని తెలిపారు. అంతకు ముందు నరసింహన్ మాట్లాడుతూ చిన్న పట్టణాలకు కనెక్టివిటీ పెంచడంపై అధికంగా దృష్టి కేంద్రీకరించాలని, అలాగే ప్రయాణికుల సంపూర్ణ భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పౌర విమానయాన సంస్థ ఎదుగుదలలో ఆంధ్రప్రదేశ్ తన వంతు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ప్రారంభోత్సవం
బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనను రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహంతో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ ప్రారంభించారు.

విమాన సంస్థల సిబ్బంది
బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనను రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహంతో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విమానయాన సంస్థల సిబ్బంది వారందించే సేవల గురించి వివరించారు.

ఏమిరేట్స్ విమానం
బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనను రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహంతో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సందడి చేసిన భారీ ఏమిరేట్స్ విమానం.

అజిత్ సింగ్‌తో గవర్నర్ నరసింహన్
దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాలతోపాటు తృతీయ శ్రేణి నగరాల్లోనూ విమానాశ్రయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ అన్నారు.

సందర్శకుల సందడి
ఏవియేషన్ షోలో భారీ ఏమిరేట్స్ విమానాన్ని చూసేందుకు అక్కడి చేరుకున్న యువకులు. ఫొటోలు తీసేందుకు వారు పోటీపడ్డారు.

వివిధ దేశాలకు చెందిన విమానాలు
బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనలో సందడి చేస్తున్న వివిధ దేశాలకు చెందిన విమానాలు.

నమూనా హెలికాప్టర్లు
బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనలో సందడి చేస్తున్న వివిధ రకాల చిన్న విమానాలు, హెలికాప్టర్ల నమూనాలు.

సేవలు వివరిస్తూ..
బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన విమానాలు సందడి చేశాయి. ఆయా దేశాలకు చెందిన సంస్థల సేవలు, పనితీరును సిబ్బంది వివరించారు.

నమూనా ఎయిర్‌బస్
బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన విమానాలు సందడి చేశాయి. వీక్షకుల కోసం ఏర్పాటు చేసిన నమూనా ఎయిర్‌బస్.

పైలట్ క్యాబిన్
బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన విమానాలు సందడి చేశాయి.

విమానం లోపలి భాగం
ప్రస్తుతం విమానయాన రంగంలో ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో ఉన్న ఇండియా 2020 నాటికి మూడో స్థానానికి చేరే అవకాశం ఉందని అజిత్ సింగ్ చెప్పారు.

ఏ-380 విమానంలో..
బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన విమానాలు సందడి చేశాయి. ఏ-380 విమానంలోపలి బిజినెస్ తరగతి.

విలాసవంతమైన ప్రయాణం
బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన విమానాలు సందడి చేశాయి. ఓ విదేశీ విమానంలోపలి తరగతిలో ఉన్న విలాసవంతమైన ఏర్పాట్లు.

విమానంలో విందు
బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన విమానాలు సందడి చేశాయి. ఆయా దేశాలకు చెందిన సంస్థల సేవలు, పనితీరును సిబ్బంది వివరించారు.

ప్రదర్శనలో విమానాలు..
బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన విమానాలు సందడి చేశాయి.

చిన్న విమానాలు
బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన విమానాలు సందడి చేశాయి.

గగనంలో..
బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన విమానాలు సందడి చేశాయి. ప్రభుత్వం 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో మారుమూల ప్రాంతాల కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని అజిత్ సింగ్ చెప్పారు.
More From GoodReturns

Hyderabad: రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఛాన్స్? బడ్జెట్ తర్వాత మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు



Click it and Unblock the Notifications