కెజి బేసిన్ గ్యాస్ కేసు: రిలయన్స్‌కు నోటీసులు

కెజి బేసిన్‌లో ఉత్పత్తి చేస్తున్న గ్యాస్‌లో రాష్ట్రానికి కేటాయింపులు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని, రాజకీయ పార్టీలు రిలయన్స్‌తో కుమ్మక్కయ్యాని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేగాక రిలయన్స్ అక్రమాలపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి గ్యాస్ కేటాయించకుండా ఆర్ఐఎల్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోదని, ఫలితంగా ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పకపోవటంతో పాటు అధిక ధరలు చెల్లించాల్సి వస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు.
రిలయన్స్ ఒత్తిడితోనే రాష్ట్రంలో తలపెట్టిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం నిలిచి పోయిందని పిటిషనర్ కోర్టుకు వివరించారు. కెజి బేసిన్‌లో 18 బావుల నుంచి సహజ వాయువులను వెలికితీస్తున్నప్పటికీ రాష్ట్రానికి సరైన వాటా లభించలేదని, రిలయన్స్ సంస్థ అక్రమాలపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీగానీ, ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ గానీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు స్పందించడం లేదని ఆరోపించారు.
ఎంఒయులోని నిబంధలనకు వ్యతిరేకంగా ఆర్ఐఎల్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని, దీనిపై చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఒప్పందానికి భిన్నంగా గ్యాస్ ధరలు పెంచాలని రిలయన్స్ సంస్థ కోరిన మరుక్షణంలోనే గ్యాస్ సరఫరా ధరలను రెట్టింపు చేశారని, గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నది భారత దేశంలోనే అయినా.. అందుకు ప్రతిగా ప్రభుత్వం అమెరికన్ డాలర్లలో చెల్లిస్తోందని, ఇంత కంటే అన్యాయం మరొకటి లేదని ఆయన తెలిపారు.
రిలయన్స్ అక్రమాలపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని, కెజి బేసిన్‌లో ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు చేసేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి. రోహిణి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేస్తూ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 2కి వాయిదా వేసింది.


Click it and Unblock the Notifications