హాట్ ఫ్యాషన్: వేసవి దుస్తుల్లో మోడల్స్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఈ వేసవిని మరింత కూల్‌గా మార్చడానికి హైద్రబాద్ సెంట్రల్ యాజమాన్యం సమ్మర్ స్పెషల్ డ్రెస్సులను అందించడానికి సిద్దమైంది. సమ్మర్ స్పెషల్ కలెక్షన్ డ్రెస్సులను స్ప్రింగ్ సమ్మర్-14 పేరిట ఆదివారం ఆవిష్కరించింది. హైదరాబాద్‌లోని పంజాగుట్టలోని సెంట్రల్‌లో నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో సమ్మర్ వేసవి ప్రత్యేక వస్త్రాలను ధరించిన మోడల్స్ హాట్‌గా కనిపించి ఆకట్టుకున్నారు.
దేశంలోని అన్ని సెంట్రల్ స్టోర్స్ లోనూ గ్లామర్‌ను ప్రతిబింబిస్తూ నిర్వహించిన ఈ ఫ్యాషన్ కలెక్షన్‌లో వెయ్యికి పైగా అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్‌లకు చెందిన దుస్తులను ప్రదర్శించారు. బోల్డ్ సాలిడ్స్, ఎఫెర్వెసెంట్ నియాన్స్, సమ్మరి పాస్టెల్స్, సైకెడెలిక్ ట్రైబల్, డిజిటల్ ప్రింట్స్, ఫంకీ యాక్సెసరీస్ మొదలుకొని లింగరీ వరకు ఈ స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ మీకెన్నో ఫ్యాషన్లను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సెంట్రల్ అందించే షలాజ్జొ, హరేమ్ ప్యాంట్స్, పాటియాలా ఫ్యాషన్లు మీ వార్డ్ రోబ్‌కు సమకాలీనతను జోడిస్తాయి. ఫ్లోరల్స్, లేస్ట్, బాల్కొనెట్స్, పైస్లే ప్రింట్స్ లాంటి స్టయిల్ ఫ్యాబ్రిక్స్ ఈ స్ప్రింగ్ సమ్మర్ 14 కలెక్షన్ ప్రత్యేకత అని చెప్పారు. దుస్తులు, పాదరక్షలు, ఐవేర్, గడియారాలు, లేడీస్ ఎత్నిక్ డ్రాండ్లలో గ్లోబల్ దేశీ, ఫ్యూషన్, బీట్స్, దేవీ బీట్స్, దేశీ బెల్లి, జిబా, మెహర్, రంగ్ మంగ్ లాంటి అనేక బ్రాండ్లలో అద్భుతమైన కలెకక్షన్లను అందిస్తుందని నిర్వహకులు వివరించారు.
ఈ సందర్భంగా సెంట్రల్, బ్రాండ్ ఫ్యాక్టరీ మార్కెటింగ్ హెడ్ జితేంద్రనాథ్ మాట్లాడుతూ.. ప్రపంచం నలుమూలల నుంచి ఆధునాతన ధోరణుల నుంచి సెంట్రల్ యొక్క స్ప్రింగ్ సమ్మర్ 14 కలెక్షన్ రూపుదిద్దుకుందని తెలిపారు. ఈ ఫ్యాషన్ షోకు సోషల్, ఫ్యాషన్ సర్కిల్ ప్రముఖలు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications