సాఫ్ట్‌వేర్, క్లౌడ్ అభివృద్ధిపైనే దృష్టి: సత్య నాదెళ్ల
న్యూయార్క్: ప్రస్తుతం మొబైల్ రంగానికి చెందిన ఉత్పత్తులపై దృష్టి సారించినట్లు మైక్రోసాఫ్ట్ నూతన సిఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. అయితే తాము సాఫ్ట్‌వేర్ రంగాన్ని పక్కన పెట్టినట్లు కాదని చెప్పారు. ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. భవిష్యత్‌లో తాము సాఫ్ట్‌వేర్ రంగంతోపాటు మొబైల్ ఫోన్ రంగ అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుత ప్రపంచం సాఫ్ట్‌వేర్ ప్రభావితమైపోయిందని, ఇంతకుముందు లేనివిధంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో తమ భావాలను పంచుకునేందుకు ఈ రంగం ఎంతగానో తోడ్పడుతోందని సత్య నాదెళ్ల తెలిపారు. ఈ రంగంతో వ్యాపార వ్యవహారాలు నడిపించడం, వినియోగదారులతో సంబంధాలను మెరుగుపర్చుకోవడం తేలికైందని చెప్పారు. తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం తమ సంస్థ సమర్థతేనని ఆయన అన్నారు.
భారతదేశంలోని మైక్రోసాఫ్ట్ ఆర్ అండ్ డి యూనిట్‌పై ఏమైనా ప్రత్యేక దృష్టి సారిస్తారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. తాను భారత్‌కు చెందినవాడిని అయినప్పటికీ తాను మైక్రోసాఫ్ట్ అభివృద్ధిలో భాగంగానే పనిచేస్తానని, చాలా దేశాల్లానే భారత్‌లోని యూనిట్ కూడా వినియోగదారులకు సేవలందిస్తుందని చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలోని తమ సంస్థలో 6,000 మంది ఉద్యోగులు, 10,000 మంది భాగస్వాములు ఉన్నారని సత్య తెలిపారు. దేశంలో క్లౌడ్ అభివృద్ధి సారించినట్లు, అది దేశంలోని ఎంటర్‌ప్రిన్యూరియల్ గ్రోత్‌కు సహకరిస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కువ మంది తమకు భాగస్వాములు ఉండటం వల్ల దేశ ఆర్థిక వృద్ధి మెరుగుపడుతుందని చెప్పారు.

సిఈఓ కంటే ముందు మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రిన్యూర్ గ్రూప్, వర్కింగ్ టువార్డ్స్ డెవలపింగ్ అండ్ రన్నింగ్ కంప్యూటర్ ప్రొగ్రామ్స్, డెవలపర్స్ టూల్స్ అండ్ క్లౌండ్ సర్వీసెస్ విభాగ అధిపతిగా పని చేశారు. అప్పుడే అతనికి క్లౌడ్ గురు పేరొచ్చింది. ఆయన ప్రణాళికలతో 107 శాతం ఈ విభాగం వృద్ధిని సాధించింది.
భారత్ నుంచి సిఈఓ అయ్యారు కదా మీ బాధ్యతలేమైనా ఉన్నాయా?
తను ఈ స్థాయికి రావడానికి సహకరించిన, మద్దతుగా నిలిచిన భారతదేశంలోని ప్రజలందరికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు సత్య నాదెళ్ల తెలిపారు. 1967లో హైదరాబాద్‌లో సత్య నాదెళ్ల జన్మించారు. భారత్‌లోని మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ పట్టాను పొందారు. ఆ తర్వాత ఉన్నత చదువులు నిమిత్తం అమెరికా వెళ్లారు. విస్కిన్సన్-మిల్వాకీ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స డిగ్రీ పట్టా పొందారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆయన ఎంబిఏ పూర్తి చేశారు.
తాను చదవగలిగే వాటికన్నా ఎక్కువ పుస్తకాలను కొన్నానని, అనేక ఆన్‌లైన్ కోర్సులను పూర్తి చేశానని సిఈఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సత్య తెలిపారు. ప్రస్తుతం తాను ఉర్దూ పోయిట్రీ చదువుతున్నానని, ఇప్పుడవి ఇంగ్లీష్‌లో లభ్యమవుతున్నాయని అన్నారు. అందమే సత్యం, సత్యమే అందమనే వ్యాఖ్యలు తనకు ఎప్పుడూ గుర్తుండిపోయేవని సత్య నాదెళ్ల తెలిపారు.


Click it and Unblock the Notifications