ముంబై: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరగడం, క్యాడ్ అదుపులోకి రావడం వంటి పరిణామాలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచడంతో భారత స్టాక్ మార్కెట్లు గురువారం సరికొత్త రికార్డులను సృష్టించాయి. బొం బాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ జీవితకాల గరిష్ఠ స్థాయిలో ముగిశాయి. 237.01 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 21513.87 పాయింట్ల వద్ద, నిఫ్టీ 72.50 పాయింట్ల వృద్ధితో 6401.15 వద్ద స్థిరపడ్డాయి. బిఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్స్ఛేంజీల చరిత్రలో ఇవే గరిష్ఠ స్థాయిలు కావడం విశేషం.
స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా దూసుకుపోవడానికి ప్రధానంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) కొనుగోళ్లు పెరగడం, కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) తగ్గడం వంటి పరిణామాలు తోడ్పడ్డాయి. గురువారం సానుకూల దృక్పథంతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే సాగింది. ఒక దశలో 21525.14 పాయింట్ల గరిష్ఠ స్థాయిని కూడా తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోల్చితే 1.11 శాతం వృద్ధితో 21513.87 పాయింట్ల వద్ద ముగిసింది. ఒకవిధంగా చెప్పాలంటే సెన్సెక్స్ రెండు రికార్డులు(నూతన ఇంట్రాడే హై, ముగింపు స్థాయి) సృష్టించింది.
2014 జనవరి 23న ఇంట్రాడేలో సెన్సెక్స్ 21,373.66 పాయింట్లను తాకి ఆల్‌టైం గరిష్ట ముగింపు నమోదు చేసిన విషయం తెలిసిందే. తర్వాత నష్టాలను చవిచూస్తూ అంతంత మాత్రం వృద్ధికే పరిమితమైంది. ఈ మధ్యకాలంలో ఎఫ్ఐఐల పెట్టుబడులు పెరగడంతో సెన్సెక్స్ మళ్లీ పుంజుకోవడం మొదలైంది. గత మూడు రోజుల్లోనే సెన్సెక్స్ 567.22 పాయింట్లు పెరిగింది. తాజా పరిస్థితులను చూస్తుంటే.. మరికొద్ది రోజులు మార్కెట్లలో ర్యాలీ ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతేగాక అంతర్జాతీయ పరిణామాలతోపాటు 16వ లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఒపీనియన్ పోల్స్ ఫలితాలు భారత మార్కెట్లను ముందుకు నడిపించేందుకు దోహదపడతాయని వారు చెబుతున్నారు. లాభాల్లో 24 సెన్సెక్స్ షేర్లు గురువారంనాటి ర్యాలీలో సెన్సెక్స్ సూచీలోని 24 షేర్లు లాభాలను మూటగట్టుకున్నాయి. ఐసిఐసిఐ బ్యాంకు, ఆర్ఐఎల్, ఎల్ అండ్ టి, హిందాల్కో, భెల్‌లు ఎక్కువ లాభాలను నమోదు చేసుకున్నాయి.
సెన్సెక్స్ సూచీలో లాభపడిన 24 షేర్లలో హిందాల్కో 4.33 శాతం, భెల్ 3.78 శాతం, ఐసిఐసిఐ బ్యాంకు 3.33 శాతం, ఒఎన్‌జిసి 2.91 శాతం, టాటా స్టీల్ 2.38 శాతం, ఎన్‌టిపిసి 2.37 శాతం, గెయిల్ ఇండియా 2.32 శాతం, సెసా స్టెరిలైట్ 2.22 శాతం, కోల్ ఇండియా 2.15 శాతం, హీరో మోటోకార్ప్ 2.03 శాతం, బజాజ్ ఆటో 1.93 శాతం, ఆర్ఐఎల్ 1.87 శాతం, మారుతి సుజుకీ 1.70 శాతం, ఎల్ అండ్ టి 1.66 శాతం, డాక్టర్ రెడ్డీస్ లాబ్ 1.27 శాతం లాభంతో ముగిశాయి.
సిప్లా, విప్రో షేర్లు నష్టాలపాలయ్యాయి. మొత్తం టర్నోవరు రూ. 2354.96 కోట్ల నుంచి రూ. 3692.06 కోట్లకు పెరిగింది. శుక్రవారం కూడా గురువారం కొనసాగిన ర్యాలీ కొనసాగే అవకాశాలున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఆసియా మార్కెట్లు ముఖ్యంగా చైనా, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, హాంకాంగ్ మార్కెట్లు 0.22 శాతం నుంచి 1.59 శాతం వర కు లాభంతో ముగిశాయి.
.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications