
2013లో ఒడిగుడుకులకు లోనైన హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ కొంత మేర పడిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. 2012 సంవత్సరంతో పోల్చితే 2013లో 4శాతం తగ్గినట్లుగా తెలిపింది. సుమారుగా 16,500 రెసిడెన్షియల్ యూనిట్లు తగ్గిపోయాయని నైట్ ఫ్రాంక్ తన నివేదికలో పేర్కొంది. కొత్తగా ప్రారంభమయ్యే యూనిట్లు కూడా 2013లో 15 శాతం పడిపోయాయని తెలిపింది. 2012లో 19వేలుగా ఉన్న యూనిట్లు 2013 నాటికి 16,500కు పడిపోయినట్లు వివరించింది.
2013లో దేశంలోని ఇతర రెసిడెన్షియల్ మార్కెట్ల కంటే కూడా హైదరాబాద్‌లో అమ్మకాలు నెమ్మదించాయని తెలిపింది. ఇందుకు పలు కారణాలు కూడా ఉన్నాయని పేర్కొంది. ఆర్థిక వృద్ధిరేటులో మందగమనం, బ్యాంకులు వడ్డీ రేటును పెంచడం, పెరిగిన ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత్వం మొదలగు కారణాలు కూడా రెసిడెన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపాయని తెలిపింది. ఇతర ఐటి, ఐటిఈఎస్ రంగాలలో ఆధిక్యాన్ని చాటుకుంటున్న నగరాలైన చెన్నై, పుణెలతో పోల్చుకుంటే హైదరాబాద్ పరిస్థితి మెరుగ్గానే ఉందని ఫ్రాంక్ నైట్ తెలిపింది.
ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ జూన్ 2న ఏర్పాటు కానుండటంతో ఇప్పటివరకు నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడినట్లయిందని నివేదిక పేర్కొంది. రాష్ట్ర విభజన సమస్య కొలిక్కి రావడంతో ఈ ఏడాది చివరి నాటికి లేదా 2015 సంవత్సరం ఆరంభంలో హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్ తిరిగి పుంజుకోనుందని ఫ్రాంక్ నైట్ పేర్కొంది. గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ మార్కెట్ ధరలు స్థిరంగా ఉన్నాయని తెలిపింది. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ 2009 నుంచి 13 శాతం మాత్రమే ధరల పెరుగుదల నమోదు చేసిందని పేర్కొంది.
అదే సమయంలో ఇతర ఐటి నగరాలైన బెంగళూరు, పుణె, చెన్నైలు 38 శాతం ధరల పెరుగుదలను నమోదు చేశాయని ఫ్రాంక్ నైట్ తెలిపింది. దేశంలోని ఇతర నగరాలు ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్‌కతాల కంటే కూడా హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ మార్కెట్ బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఇక్కడ ధరలు కూడా అందుబాటులో ఉన్నాయని ఫ్రాంక్ నైట్ నివేదిక పేర్కొంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications