
న్యూఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో ఏడవ ఇంటర్‌పోల్ గ్లోబల్ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ), ఇంటర్ పోల్‌లు అమెరికా న్యాయశాఖ, అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్‌ల సమన్యయంతో ఈ ప్రతిష్టాత్మక వర్క్‌షాప్‌ను నిర్వహించారు. సిబిఐ హెడ్ క్వార్టర్స్‌లోనే గతంలో నిర్వహించిన తొలి రెండు గ్లోబల్ ఇంటర్ పోల్ కాన్ఫరెన్స్‌లలో శరత్ కుమార్ పాల్గొని ‘ట్రాకింగ్ ద ప్రొసీడ్స్ ఆఫ్ కరప్షన్ యూజింగ్ ఫోరెన్సిక్/ఫైనాన్షియల్ ఆడిట్ ట్రయల్స్' అనే అంశంపై ప్రసంగించారు.
ఫైనాన్షియల్ స్ట్రాటజీ/రీస్ట్రక్చరింగ్, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ప్రివెంటివ్ ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్‌లలో శరత్ కుమార్‌కు అమితమైన పట్టుంది. ఇప్పటికే పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు సలహాదారుగా ఉన్న ఆయన, నిఘా-అవినీతి నిరోధక కార్యకలాపాల ప్రచారంలోనూ ఆయన పాలుపంచుకుటూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నల్ ఆడిట్ కమిటీలో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.
అంతేగాక ఏసిబి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఏపి పోలీస్ సంక్షేమ విభాగం తదితరాలకు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఎస్‌విపి జాతీయ పోలీస్ అకాడమి, కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ జాతీయ అకాడమీ, ప్రత్యక్ష పన్నుల జాతీయ అకాడమీ, సిబిఐ అకాడమి, ఏపి పోలీస్ అకాడమి, డాక్టర్ ఎంసిఆర్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ, ఎస్‌బిఐ ట్రైనింగ్ కాలేజి లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో శరత్ కుమార్ విజిటింగ్ ఫ్యాకల్టీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


Click it and Unblock the Notifications