తీహార్ జైలుకు సుబ్రతా: వారం రోజుల కస్టడీ

మహిళా డైరెక్టర్ వందనా భార్గవను మాత్రం కోర్టు వదిలిపెట్టింది. తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్ కెఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జెఎస్ ఖెహర్‌లతో కూడిన ధర్మాసనం సుబ్రతా రాయ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ముందు తప్పుడు అఫిడవిట్లు, పరస్పర వ్యతిరేక ప్రకటనలు కూడా సహారా చేసిందని పేర్కొంది. కాగా, ‘రాయ్‌ని న్యాయస్థానం ముందుకు తీసుకువచ్చారు. చట్టం గౌరవం కాపాడటం జరిగింది. న్యాయస్థానం ప్రతిష్టకు భంగం కలగలేదు'అని సుబ్రతా రాయ్ తరపు న్యాయవాది రామ్ జెఠ్మలానీ పేర్కొన్నారు.
అయితే ఫిబ్రవరి 26న జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ కు అనుగుణంగా సుబ్రతా వ్యవహరించారో లేదో ఉత్తరప్రదేశ్ పోలీసులను అడిగి తెలుసుకోవాలని సూచించింది. కాగా, ‘ఫిబ్రవరి 26న న్యాయస్థానం ముందు హాజరు కానందున బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను. నా క్షమాపణలు మన్నించండి. నాకు న్యాయస్థానం మీద పూర్తి విశ్వాసం ఉంది' అని సుబ్రతా కోర్టును వేడుకున్నారు. సుబ్రతా క్షమాపణలను మన్నించినట్లు సుప్రీం కోర్టు పేర్కొంది.
సుబ్రతా రాయ్ కుమారులు సుశాంతో రాయ్, సీమంతో రాయ్ కూడా విచారణ సమయంలో కోర్టుకు హాజరయ్యారు. సహారా ప్రతిపాదనలను వివరించేందుకు రామ్ జెఠ్మలానీ, మరో సీనియర్ న్యాయవాది సిఎ సుందరం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పటికే అనేక సార్లు సమయమిచ్చామని, ఏదో కారణం చెప్పి కేసును జాప్యం చేశారని ధర్మాసనం పేర్కొంది.
సహారా ఆస్తులను విక్రయించడానికి న్యాయస్థానం అనుమతి ఎందుకు?, ఆస్తులను మీరే విక్రయించుకోవచ్చని అని సహారాకు ధర్మాసనం తెలిపింది. సెబీ సహారా ఆస్తులను విక్రయించలేదని స్పష్టం చేసింది. ఆస్తులను విక్రయించి ఇన్వెస్టర్ల సొమ్మును చెల్లించాలని సహారాను కోర్టు ఆదేశించింది. కాగా, తీహార్ జైలులో సుబ్రతా రాయ్ నేల మీదే పడుకుంటారని, సాధారణ ఖైదీలాగే జైలు తిండినే తింటారని తీహార్ జైలు ప్రతినిధి సునీల్ గుప్తా తెలిపారు. ఖైదీల నుంచి కాపాడేందుకు సుబ్రతా సివిల్ సెల్ ఉంచనున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications