
2005 సంవత్సరానికి ముందు ప్రింట్ అయి వెనుక వైపు ముద్రణ సంవత్సరం లేని కరెన్సీ నోట్లను ఆ గడువు లోగా ప్రజలు మార్పిడి చేసుకోవలసి ఉంటుంది. అలాంటి నోట్లకు పూర్తి మార్పిడి కల్పించాలని ఆర్‌బిఐ బ్యాంకులను ఆదేశించింది. ఆ నోట్లన్నీ యథాతథంగా చలామణిలో ఉంటాయని, వాటిని ప్రజలు యథాతథంగా చెలామణిలో ఉంచుకోవడంతో పాటు ఎవరి వద్ద నుంచైనా వచ్చినా నిరభ్యంతరంగా అందుకోవచ్చునని కూడా ఆర్‌బిఐ తెలిపింది.
2005 తర్వాత ముద్రించిన కరెన్సీ నోట్లపై వెనుక వైపు కింది మధ్య భా గంలో ముద్రించిన సంవత్సరం ప్రచురించి ఉంటుంది. కరెన్సీ నోట్లను అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉండేలా చేయడానికి మాత్రమే 2005కి ముందు ముద్రించిన ముద్రణ సంవత్సరం లేని కరెన్సీ నోట్ల ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. చాలా మంది ఇప్పటికే అలాంటి కరెన్సీ నోట్లను మార్పిడి చేసుకున్నారని, మిగతావి కూడా ఉపసంహరించేందుకు వీలుగా ఈ మార్పిడి గడువును పొడిగించామని పేర్కొంది.
ఆసియా మార్కెట్లపై యుద్ధమేఘాలు
రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం సంభవించవచ్చునన్న భయాలకు తోడు దేశీయంగా వృద్ధి రేటు దిగజారినట్టు గణాంకాలు నిర్ధారించడంతో స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. వరుసగా ఐదు రోజులు ఎగువకే పయనించిన స్టాక్ ఇండెక్స్‌లు దేశీయ, అంతర్జాతీయ పరిణామాల వల్ల సోమవారం నష్టాలు నమోదు చేశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీలోని ప్రధాన సూచిక సెన్సెక్స్ 173 పాయింట్లు దిగజారి 20,946.65 పాయింట్ల వద్ద క్లోజ్ కాగా ఎన్ఎస్ఇలోని నిఫ్టీ 55.50 పాయింట్లు దిగజారి 6221.45 పాయింట్ల వద్ద ముగిసింది.
కంపెనీల పరంగా డాక్టర్ రెడ్డీస్, భెల్ నష్టాల్లో అగ్రస్థానం లో నిలిచాయి. రష్యాకు తూర్పు తీరంలో ఉన్న క్రిమి యా ఫెర్రీ టెర్మినల్‌ను రష్యా సేనలు స్వాధీనం చేసుకోవడం, రష్యా తమపై దాడి చేయడాన్ని ఖండిస్తూ తాము ఒక వినాశం అంచుల్లో ఉన్నామంటూ ఉక్రెయిన్ ప్రధాని అర్సెనీ యత్సెన్యుక్ హెచ్చరించడం వంటి పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడ్ కావడం భారత మార్కెట్‌ను ప్రభావితం చేసిందంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications