సర్వే: ముకేషే నెం.1, తెలుగువారికీ స్థానం

భారత్‌లోని సంపన్నుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారని, అతని సంపద విలువ 1,800 కోట్ల డాలర్లు ఉందని పేర్కొంది. అంతర్జాతీయ బిలియనీర్ల జాబితాలో అంబానీ 41వ స్థానంలో ఉన్నారు. కాగా ఈ జాబితాలో బిల్‌గేట్స్ మొదటిస్థానంలో నిలిచారు. ఈయన వ్యక్తిగత సంపద 6,800 కోట్ల డాలర్లు. బిల్‌గేట్స్ తర్వాతి స్థానంలో బెర్క్‌షైర్ హాత్‌వే సారథి వారెన్ బఫెట్ నిలిచారు. ఈయన వ్యక్తిగత సంపద 6,400 కోట్ల డాలర్లు ఉన్నట్టు హురున్ సంస్థ పేర్కొంది.
ఇండిటెక్స్‌కు చెందిన అమాన్సియో ఒర్టెగా సంపద 6,200 కోట్ల డాలర్లు ఉండగా.. ఈయన మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కార్లోస్ స్లిమ్ హెలె అండ్ ఫ్యామిటీ 6,000 కోట్ల డాలర్ల సంపదతో నాలుగో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఒరాకిల్‌కు చెందిన లారీ హెలిసన్ 5వ (6,000 కోట్ల డాలర్లు) స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌లో 70 మంది బిలియనీర్లున్నారు. గత ఏడాదితో పోల్చితే బిలియనీర్ల సంఖ్య 17 పెరిగింది. యుకె, స్విట్జర్లాండ్, జపాన్, ఇండియా, రష్యా వంటి దేశాల్లో బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని చైనా సంస్థ పేర్కొంది.
భారత్‌కు చెందిన లక్ష్మీ నివాస్ మిట్టల్ 1,700 కోట్ల డాలర్ల సంపదతో 49వ స్థానంలో ఉన్నారు. సన్‌ఫార్మాకు చెందిన దిలిప్ సంఘ్వి, విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్‌జీలు 77వ స్థానంలో నిలిచారు. వీరిద్దరి వ్యక్తిగత సంపద 1,350 కోట్ల డాలర్లుగా ఉంది. కాగా, టాటా సన్స్ చీఫ్ పల్లోంజి మిస్త్రీ 93వ స్థానంలో ఉన్నారు. ఈయన వ్యక్తిగత సంపద 1,200 కోట్ల డాలర్లుగా ఉంది. ఎస్‌పి హిందుజా అండ్ ఫ్యామిలీ కూడా 1,200 కోట్ల డాలర్లతో 93వ స్థానంలో నిలిచింది.
జాబితాలో తెలుగు పారిశ్రామికవేత్తలు
అంతర్జాతీయ కుబేరుల జాబితాలో ముగ్గురు తెలుగు పారిశ్రామికవేత్తలు చోటుదక్కించుకున్నారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ చైర్మన్ జివి ప్రసాద్ 954వ స్థానంలో నిలిచారు. తొలిసారిగా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న ఈయన సంపద విలువ 200 కోట్ల డాలర్లుగా ఉంది. మరో ఫార్మా సంస్థ దివీస్ లాబొరెటరీస్ కు చెందిన మురళీ దివి 160 కోట్ల డాలర్ల సంపదతో 1209వ స్థానంలో నిలిచారు. మరో పారిశ్రామిక, మౌలికరంగ సంస్థ జిఎంఆర్ గ్రూప్ సారథి గ్రంధి మల్లిఖార్జున రావు 130 కోట్ల డాలర్ల సంపదతో ఈ జాబితాలో 1443వ స్థానంలో ఉన్నారు.


Click it and Unblock the Notifications