హైదరాబాద్: తెలంగాణకు ప్రత్యేక హోదా కోసం ఎంతగానో కృషి చేసినప్పటికీ ఫలితం లభించలేదని ఎంపి వివేక్ అన్నారు. 'తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలు, సమస్యలు' అనే అంశంపై శుక్రవారం హైదరాబాద్‌లోని ఫ్యాప్సీలో తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫోరమ్ (టిఎఫ్) నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకునేందుకు అందరం ఇరవై శాతం అదనంగా పని చే యాల్సి ఉంటుందని తెలిపారు. బ్రాండ్ హైదరాబాద్‌ను మరింత పటిష్ఠం చేసుకునే దిశగా సన్నాహాలు చేయాలని, తెలంగాణకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలకంగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సానుకూల పరిస్థితులుంటే సుమారు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఏపికి పెట్టుబడులు టికి దెబ్బే: టిఎఫ్
విభజన తర్వాత ఏర్పాటవుతున్న ఆంధ్రప్రదేశ్(సీమాంధ్రకు)కు ప్రత్యేక హోదాతో పాటు సెంట్రల్ ఎక్సైజ్, ఆదాయపన్ను రాయితీలు, టాక్స్ హాలిడేస్ ప్రకటించటం ద్వారా తెలంగాణ పారిశ్రామిక రంగానికి తీవ్ర విఘాతం కలుగుతుందని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫోరమ్ (టిఎఫ్) పేర్కొంది. కొత్త రాష్ట్రానికి ప్రకటించిన రాయితీలతో కొత్త పరిశ్రమలతో పాటు ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిశ్రమలు కూడా అక్కడకే తరలిపోయే అవకాశం ఉందని, అందువల్ల తెలంగాణ రాష్ట్రానికీ అదే తరహా ప్యాకేజీ ప్రకటించాలని టిఫ్ కోరింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు జె గీతారెడ్డి, ప్రసాద్ కుమార్, పార్లమెంట్ సభ్యులు జి వివేక్, తెలంగాణ జెఏసి చైర్మన్ కోదండరాం పాల్గొన్నారు.
‘సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక హోదాను ఇవ్వటం ఆహ్వానించదగినదే. తెలంగాణకూ ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు కోసం పోరాడాలి. లేనిపక్షంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు. ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో కొత్త రాష్ట్రం మరింత వెనుకబడుతుంది. కొత్త సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుంది. రాష్ట్రం ఏర్పడిందన్న సంతోషం ఆవిరైపోతుంది. రాజకీయ పక్షాలు చొరవ తీసుకుని ప్రత్యేక హోదా, ప్యాకేజీలు తీసుకువచ్చే విధంగా కృషి చేయాల్సి ఉంది' అని మై హోం ఇండస్ట్రీస్ చైర్మన్ జె రామేశ్వర్ రావు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఎపిఐఐసి) స్వాధీనంలో 98 వేల ఎకరాల భూమి ఉందని, ఇందులో తెలంగాణ వాటా 28 వేల ఎకరాలు మాత్రమేనని తెలిపారు. ఇందులో 95 శాతం భూమి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే ఉందని, మున్ముందు ఈ ప్రాంతంలో భూసేకరణ చేపట్టడం కూడా సమస్యగా ఉంటుందని పేర్కొన్నారు.
ఆంధ్రా ప్రాంతంలో 199 పారిశ్రామిక పార్కులు ఉండగా తెలంగాణలో 133 మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఇందులో కూడా 90 పార్కులు రంగా రెడ్డి, మెదక్ జిల్లాలోఉన్నాయని, మిగిలిన తెలగాణ జిల్లాలో 40 పార్కులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుంటే, ఇక్కడి పరిశ్రమలను మూసుకోవటం మినహా గత్యంతరం లేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కోసం 5,000 కోట్ల రూపాయలతో తెలంగాణ డెవలప్‌మెంట్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని పలువురు పారిశ్రామిక వేత్తలు అభిప్రాయపడ్డారు.

ప్రజాప్రతినిధులు
'తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలు, సమస్యలు' అనే అంశంపై శుక్రవారం హైదరాబాద్‌లోని ఫ్యాప్సీలో ఒక సమావేశాన్ని టిఫ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎంపి వివేక్, మాజీ మంత్రి గీతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

గీతారెడ్డి ప్రసంగం
'తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలు, సమస్యలు' అనే అంశంపై శుక్రవారం హైదరాబాద్‌లోని ఫ్యాప్సీలో ఒక సమావేశాన్ని టిఫ్ నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడారు.

గీతారెడ్డికి స్వాగతం
కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను పొన్నాల ప్రారంభించారు. కార్యక్రమానికి పుష్ప గుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న సుధీర్ రెడ్డి.

వేదికపై..
విభజన తర్వాత ఏర్పాటవుతున్న ఆంధ్రప్రదేశ్(సీమాంధ్రకు)కు ప్రత్యేక హోదాతో పాటు సెంట్రల్ ఎక్సైజ్, ఆదాయపన్ను రాయితీలు, టాక్స్ హాలిడేస్ ప్రకటించటం ద్వారా తెలంగాణ పారిశ్రామిక రంగానికి తీవ్ర విఘాతం కలుగుతుందని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫోరమ్ (టిఎఫ్) పేర్కొంది.

కోదండరాం
'తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలు, సమస్యలు' అనే అంశంపై శుక్రవారం హైదరాబాద్‌లోని ఫ్యాప్సీలో ఒక సమావేశాన్ని టిఫ్ నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జెఏసి ఛైర్మన్ కోదండరాం ప్రసంగించారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications