హైదరాబాద్ రియాల్టీకి ఢోకాలేదు, ఇదే అవకాశం: పొన్నాల

ఐటిఐఆర్ లాంటి మహోన్నత ప్రాజెక్టులు నగరంలో అనేక మందికి ఉపాధిని కల్పించనున్నాయని అన్నారు. కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన హైదరాబాద్ ప్రాపర్టీ షోను పొన్నాల ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కార్మికశాఖ మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ మంత్రి గీతారెడ్డి, ఎంపి వివేక్, తెలంగాణ జెఏసి ఛైర్మన్ కోదండరాం హాజరయ్యారు.
నగరంలోని మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు హైదరాబాద్ ప్రాపర్టీ షో దోహదపడుతుందని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ధరలు ఉండటంతో, స్థిరాస్తి కొనుగోలుకు ఇదే సరైన సమయం అని ఆయన అన్నారు.
క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు జైవీర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో అభివృద్ధి చెందిన నగరాలతో పోలిస్తే, హైదరాబాద్‌లోనే ప్రాపర్టీ ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభం కావడంతో రాజకీయ అనిశ్చితి తొలగిపోవడంతో స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని అన్నారు.


Click it and Unblock the Notifications