జగన్ పార్టీలోకి రామ్‌కీ అధినేత

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో అయోధ్య రామిరెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. జగన్‌కు రామిరెడ్డి బాగా సన్నిహితులన్న పేరుంది. ఈ పార్టీ తరఫునే ఆయన గుంటూరు జిల్లా నుంచి లోక్‌సభకు పోటీ చేయవచ్చని అంటున్నారు. మంగళవారం జరిగిన కంపెనీ బోర్డు సమావేశంలో అయోధ్య రామిరెడ్డి రాజీనామాను ఆమోదించినట్టు తెలిసింది.
ఇదే సమావేశంలో ప్రస్తుతం ఆడిట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న కమలేష్ శివాజీ వికమ్‌సీని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఆరు నెలల కాలానికి నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త బాధ్యతల స్వీకరణకు వీలుగా వికమ్‌సీ ఆడిట్ కమిటీ చైర్మన్ పదవికీ, సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఆడిట్ కమిటీ కొత్త చైర్మన్‌గా ఎజి రవీంద్రనాథ్ రెడ్డిని నియమించారు.
ఇదిలా ఉండగా, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నియామకం కోసం తగిన వ్యక్తిని ఎంపిక చేసేందుకు సెలెక్షన్ కమిటీని కూడా బోర్డు సమావేశంలో నియమించారు. ఈ కమిటీలో వికమ్‌సీ, అర్చనా నిరంజన్ హింగోరనీ, ఎజి రవీంద్రనాథ్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రాజీవ్ మలివాల్ ఉన్నారు.


Click it and Unblock the Notifications