ముంబై/హైదరాబాద్: పారిశ్రామిక రంగానికి వెన్నుదన్నుగా నిలిచే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయినా వృద్ధిరేటు పెరగకపోవచ్చని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ దిగ్గజం మూడీస్ అంచనా వేసింది. గత కొద్ది నెలలుగా దేశ ఆర్థిక వ్యవస్థను చికాకు పెడుతున్న ఒడిదుడుకులు తగ్గుముఖం పట్టినప్పటికీ 2015వరకు ఆర్థికాభివృద్ధిలో పెను మార్పులుండవని మూడీస్ తెలిపింది.
వచ్చే మేలో జరిగే సాధారణ ఎన్నికలు మంచి ప్రభుత్వాన్ని అందించే అవకాశాలున్నాయని, నరేంద్రమోడీ ప్రధాని అయితే ఈ అవకాశాలు మరింత పెరుగుతాయని, అయితే ఆర్థిక వ్యవస్థ సరైన బాట పట్టాలంటే చాలా కాలం పడుతుందని, ఈ ఏడాది ఆర్థికవ్యవస్థ పట్టాలనెక్కే అవకాశం లేదని సంస్థ"ఇండియా అండర్‌వెల్మ్స్'' అనే తన నివేదికలో వెల్లడించింది. దేశ జిడిపి తృతీయ త్రైమాసికంలో 4.8 శాతం వృద్ధి చెందుతుందన్న అంచనాలు భారత్ వృద్ధి బాట పట్టేందుకు సమయం పడుతుందన్న తమ అంచనాలకు బలం చేకూరుస్తున్నాయని సంస్థ సీనియర్ ఎకనమిస్ట్ గ్లెన్ లెవిన్ పేర్కొన్నారు

రాంకీ పదవులకు రామిరెడ్డి రాజీనామా: వచ్చే ఎన్నికల్లో పోటీ
హైదరాబాద్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతో రాంకీ ఇన్‌ఫ్రా ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్, డైరెక్టర్ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు అయోధ్య రామిరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన బిఎస్ఇకి సమాచారం అందజేశారు. దీంతో కంపెనీ నాన్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్‌గా కమలేశ్ శివ్‌జీ వికమ్‌సేను 6 నెలల కాలానికి నియమిస్తున్నట్లు బిఎస్‌ఈకి రాంకీ ఇన్‌ఫ్రా తెలిపింది. ఫిబ్రవ
రి 25న సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడంతోపాటు కమలేశ్ నియమకాన్ని ఆమోదించినట్లు బిఎస్ఈ దృష్టికి తీసుకెళ్లారు. కాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రామిరెడ్డి సన్నిహితుడు కావడంతో ఆ పార్టీ నుంచే పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫునే ఆయన గుంటూరు జిల్లా నుంచి లోక్‌సభకు పోటీ చేసే అవకాశం ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు



Click it and Unblock the Notifications