For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుబ్రతా రాయ్‌కి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

|

న్యూఢిల్లీ: సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్‌కి సుప్రీం కోర్టు బుధవారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. కోర్టు ధిక్కార కేసులో ఇంతకుముందు వాదనలు విన్న అనంతరం సుప్రీం కోర్టు తమ ముందు హాజారు కావాలని సుబ్రతా రాయ్‌ని ఆదేశించింది. అయితే సుబ్రతా రాయ్ కోర్టు ఎదుట హాజరుకాకపోవడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది.

సుబ్రతా రాయ్‌ని అరెస్ట్ చేసి తమ ముందు మార్చి 4లోగా హాజరుపర్చాలని సుప్రీం కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, తన తల్లి (95)కి ఆరోగ్యం బాగోలేదని, అందువల్ల తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఇంతకుముందు సుబ్రతా రాయ్ కోర్టును కోరారు. అయితే కోర్టు అతని వినతిని తిరస్కరించింది.

Subrata Roy

తమ పరిధి చాలా ఎక్కువ అని ఆ సమయంలో కోర్టు పేర్కొంది. పెట్టుబడిదారులకు సంబంధించిన రూ. 20వేల కోట్లను తిరిగి చెల్లించనందున తమ ముందు హాజరు కావాలని సుప్రీం కోర్టు ఇంతకుముందు ఆదేశించింది.

English summary

సుబ్రతా రాయ్‌కి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ | SC issues non-bailable warrant against Sahara chief Subrata Roy

The Supreme Court on Wednesday issued a non-bailable warrant against Sahara group chief Subrata Roy for failing to appear before it in person as directed by the court at its last hearing.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X