ముంబై: విమానయాన ప్రయాణీకుల కోసం స్పైస్‌జెట్ మరో కొత్త ఆఫర్‌ను ముందుకు తెచ్చింది. ‘సూపర్ సమ్మర్ సేల్' పేరిట తీసుకొస్తున్న ఈ ఆఫర్‌లో భాగంగా విమాన టికెట్ ధరలను ఏకంగా 75 శాతం వరకు తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. బుధవారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉండే ఈ పథకం ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు వాస్తవ ధరల కంటే 75 శాతం తక్కువ ధరలకే స్పైస్‌జెట్ విమానాల్లో ప్రయాణించే వెసులుబాటును సంస్థ కల్పించింది.
వేసవికాలం మొదలవుతుండటంతో హాలీడే టూర్లకు వెళ్లేవారికి ఈ పథకం ఎంతగానో పయోగపడుతుందని స్పైస్‌జెట్ పేర్కొంది. కాగా, గడిచిన నెల రోజుల్లో ఇలాంటి పథకాలను స్పైస్‌జెట్ ప్రవేశపెట్టడం ఇది మూడోసారి. ఇంతకు ముందు ప్రకటించిన రెండు ఆఫర్లకు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించడంతోనే మూడో ఆఫర్‌కు శ్రీకారం చుట్టినట్టు కంపెనీ అధికార వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఆఫర్ల ద్వారా తరచూ ప్రయాణాలు చేసే వారే కాకుండా కొత్తగా విమాన ప్రయాణం చేయాలనుకునే వారు చవకగా టికెట్లను సొంతం చేసుకోవచ్చని స్పైస్ జెట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజివ్ కపూర్ తెలిపారు.
ఇలాంటి అడ్వాన్స్ కొనుగోలు ఆఫర్ల మూలంగా కస్టమర్లకు, సంస్థకు, పరిశ్రమకు ఉభయతారకంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఆఫర్ లేకుండా మిగిలి ఉన్న సీట్లతో ఖాళీగా విమానాలను నడపాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఎయిర్‌లైన్స్ కంపెనీల మధ్య ఆఫర్ల పోరుకు తాము ప్రయత్నం చేయడం లేదని, ఇన్వెంటరీ, రెవెన్యూ మేనేజ్‌మెంట్‌లో భాగంగానే ఆఫర్లను ప్రకటిస్తున్నామని ఆయన చెప్పారు.

కాగా ఇంతకు ముందు రెండుసార్లు ఆఫర్లు ప్రకటించినప్పుడు ఇతర కంపెనీలు కూడా పోటీగా ఆఫర్లను ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా స్పైస్‌జెట్ బాటలోనే ఇతర చౌక విమానయాన కంపెనీలైన ఇండిగో, గోఎయిర్‌లు ఆఫర్లను ప్రకటించాయి. సోమవారం నుంచి మూడు రోజుల పాటు బుకింగ్ చేసుకునే టికెట్లపై 70 శాతం వరకు ధరలను తగ్గిస్తున్నట్టు గోఎయిర్ ప్రకటించింది. కొన్ని టికెట్లపై ఇండిగో డిస్కౌంట్లను ప్రకటించింది. వచ్చే హాలీడే సీజన్‌లో ఉండే అవకాశాలను ముందుగానే సొంతం చేసుకోవడానికి కంపెనీలు డిస్కౌంట్లకు మళ్లీ తెరతీశాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.
గోవా, కేరళ వంటి గమ్యస్థానాలకు ఇప్పటికే గిరాకీ బాగా ఉందని, తాజాగా ఆఫర్లు ప్రకటించడంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ట్రావెల్ పోర్టల్ యాత్రా డాట్ కామ్ ప్రెసిడెంట్ శరత్ ధాల్ పేర్కొన్నారు. కంపెనీలు ఆఫర్లు ప్రకటించడంతో బుకింగ్ రెండింతలకు పైగా పెరిగాయని ఆయన చెప్పారు. కళానిధి మారన్ సారథ్యంలోని స్పైస్ జెట్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి 172 కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టుకుంది. దీన్ని తగ్గించుకోవడానికే పలుమార్లు ఆఫర్లకు తెరతీస్తున్నట్టు తెలుస్తోంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications