ఎడిబి ట్రిబ్యునల్ ప్రెసిడెంట్‌గా లక్ష్మీ స్వామినాథన్
చెన్నై/న్యూఢిల్లీ: అసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ప్రెసిడెంట్‌గా లక్ష్మీ స్వామినాథన్ ఎన్నికయ్యారు. ఈమె ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనునాన్నరని ఎడిబి ఒక ప్రకటనను విడుదల చేసింది. లక్ష్మీ స్వామినాథన్ ట్రిబ్యునల్‌కు ఎన్నికైన ఏడవ ప్రెసిడెంట్ కాగా, ట్రిబ్యునల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తొలి భారతీయ వ్యక్తి కూడా ఈమే కావటం గమనార్హం.
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన 35వ వార్షిక సమావేశంలో జస్టిస్ లక్ష్మీ స్వామినాథన్‌ను ప్రెసిడెంట్‌గా, ప్రొఫెసర్ రాయ్ లూరుూస్‌ను వైస్ ప్రెసిడెంట్‌గా ట్రిబ్యునల్ ఎన్నుకుందని ఎడిబి తన ప్రకటనలో పేర్కొంది. ఇంతకుముందు ప్రెసిడెంట్లుగా పనిచేసిన ఆరుగురిలో అమెరికా నుంచి ఇద్దరు, ఫిలిప్పీన్స్ నుంచి ఇద్దరు, శ్రీలంక, బ్రిటన్‌లనుంచి ఒక్కొక్కరు ఎన్నికయ్యారు. ఇక 2010లో లక్ష్మీ స్వామినాథన్ ట్రిబ్యునల్‌లో సభ్యులుగా చేరగా, ఆగస్టు 2013 వరకు ట్రిబ్యునల్ తాత్కాలిక ప్రెసిడెంట్‌గా బాధ్యతలను నిర్వహించారు.

ఆర్‌బిఐకి మద్రాస్ హైకోర్టు నోటీసులు
చెన్నై: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు శనివారం మద్రాస్ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. 2005కు ముందు ముద్రించిన నోట్లను తిరిగి ఇచ్చేసి, వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకోవాలంటూ ఇటీవల ఆర్‌బిఐ జారీ చేసిన నోటిఫికేషన్ అభ్యంతరకరంగా, అయోమయంగా ఉందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారించిన ధర్మాసనం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
జనవరి 28న జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌లో సరైన కారణాలు పేర్కొనలేదని తద్వారా ప్రజలు ఆయోమయానికి గురవుతున్నారని ఎస్ శ్రీనివాసన్ నారాయణన్ అనే న్యాయవాది మద్రాసు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారించిన న్యాయస్థానం ఆర్‌బిఐకి నోటీసులు జారీ చేసింది.


Click it and Unblock the Notifications