హైదరాబాద్ గ్లోబల్ సిటీ, కోస్తా, సీమకు మహర్దశ

ఉత్తరాంధ్రలో విజయనగరం, విశాఖపట్నం పరిసరాల్లో అభివృద్ధి బాగా జరుగుతుందని ఆయన అన్నారు. కాగా హైదరాబాద్ ఎప్పటిలాగానే తన ఉనికిని చాటుకుంటూ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందని రాణా కపూర్ తెలిపారు. తెలంగాణ సంక్షోభానికి పరిష్కారం లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు సముద్ర తీరం కలిసి వచ్చే అంశమని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రత్యేక హోదాతో కొత్త పరిశ్రమలకు పన్ను రాయితీలు కూడా లభిస్తాయని అన్నారు. రాయలసీమలో అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నక్సల్స్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కూడా సమానాభివృద్ధికి ప్రణాళిక ఖరారు చేయాలన్నాని ఆయన కోరారు.
ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి), ఫార్మాసూటికల్స్ రంగం వెన్నెముకగా నిలవనుండగా.. సీమాంధ్ర ప్రాంత వృద్ధికి చమురు, సహజ వాయువు, విద్యుదుత్పత్తి, పోర్టులు కీలకంగా ఉండనున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్‌లో రెండు రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని అసోచాంతోపాటు ఆర్థిక నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications